కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కుప్పకూలిన రియల్ ఎస్టేట్

May 26, 2020

ముఖ్యమంత్రి జగన్ పరిపాలన కృష్ణా గుంటూరు జిల్లాలను మధ్యయుగాల్లోకి తీసుకెళ్లే కోణంలో సాగుతోంది. పెద్ద సంఖ్యలో జగన్ అక్కడ జగన్ కు మద్దతు ఇచ్చినా జగన్ మాత్రం ప్రతిరోజు ఆ రెండు జిల్లాల అభివృద్ధిలో తిరోగమనం వైపు పయనించేలా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ముందుగా అమరావతి పనులు ఆపేసి, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేయడంతో ఒక వరల్డ్ క్లాస్ సిటీని ఆ జిల్లా ప్రజలు కోల్పోవడమే కాదు... లెక్కలేనన్ని అవకాశాలను మిస్సయ్యారు. అమరావతి అభివృద్ధి చెంది ఉంటే... గుంటూరు జిల్లా ప్రజల భవిష్యత్తు మరోలా ఉండేది. అక్కడ వ్యాపారాలు వృద్ధి చెందేవి. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేవి. విద్య, వైద్యం అందుబాటులో ఉండేది. కానీ అమరావతిని ఆపేయడంతో గుంటూరు, పక్కనున్న కృష్ణా జిల్లా తీవ్రంగా నష్టపోయాయి. అంతేకాదు, జగన్ వచ్చాక భూములు, ఇళ్ల విలువ సగానికి పైగా పడిపోయింది. అమరావతికి రుణం మంజూరు చేసిన వరల్డ్ బ్యాంకు, ఆసియా బ్యాంకులను పట్టించుకోకపోవడంతో అవి తమ ప్రతిపాదన విరమించుకున్నాయి. జగన్ చేసిన ఈ పని వల్ల భవిష్యత్తులో వేరే ముఖ్యమంత్రి వచ్చి రాజధాని మళ్లీ కట్టాలన్నా కూడా లోను దొరకని పరిస్థితి.
మరోవైపు గురువారం రాత్రి మచిలీపట్నం పోర్టును రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో అక్కడా ఇదే పరిస్థితి. ఉపాధి అవకాశాలు ప్రజలు కోల్పోయారు. పోర్టు వెంటనే అభివృద్ధి చెంది ఉంటే... ఆ ప్రాంతం స్వరూపమే మారిపోయేది. కృష్ణా జిల్లాలో రియల్ ఎస్టేట్ ధరలు ఇపుడు కుప్పకూలాయి. పైగా ప్రజలు భవిష్యత్తుపై ఆశ కోల్పోయారు. మరోవైపు ఖరీఫ్ లో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సకాలంలో నీరు అందలేదు. ప్రభుత్వ కరవు నివారణ చర్యల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. కేవలం నవయుగ కంపెనీ మీద కక్ష గట్టిన జగన్ ఆ కంపెనీ చేపడుతున్న పోలవరం, మచిలీపట్నం ప్రాజెక్టును రద్దు చేశారు. తన వాళ్లకు ఆ ప్రాజెక్టును కట్టబెడతారని అందరూ ఆరోపిస్తున్నారు.