కరోనా గురించి ఒక * కీలక అప్ డేట్ *

August 15, 2020

130 కోట్ భారతావని కరోనా విషయంలో అందరి అంచనాలు మించిపోతోంది. సంపన్న రాజ్యాలను తలదన్నుతూ పోతోంది. మరణాల రేటు కూడా పెరుగడం కొంచెం విషాదకరం గానీ ఇంకా మిగతా వారి కంటే తక్కువే.

ఈరోజుకి కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9996 కేసులు నమోదు కాగా, 357 మంది మృతి చెందారు. దీన్ని బట్టి ​భారత్ లో కరోనా కేసులు, మరణాలు వేగంగా పెరుగుతున్నట్టే లెక్క. ఇప్పటివరకు దేశంలో దేశవ్యాప్తంగా 2,86,579 కేసులు లెక్క తేలాయి. 8102 మంది మృతి చెందారు.

​​అయితే... కేంద్రం ఒక కొత్త పరిశీలనను విడుదల చేసింది.  దేశ వ్యాప్తంగా 1,37,448 యాక్టీవ్ కేసులుండగా, 1,41,029 మంది డిశ్చార్జ్ అయ్యారట. ఇతర దేశాల్లో పరిశీలనల ప్రకారం కరోనా బలహీన పడటానికి ఇదొక సూచిక అని పేర్కొంది.

రికవరీ కేసుల సంఖ్య కొత్త కేసుల కంటే ఎక్కువగా నమోదవుతుంటే.. మనం మెరుగు పడుతున్నాం అని భావించొచ్చని చెప్పింది. అయితే... భారతదేశం భిన్నమైనది మనం ఎవ్వరితో పోల్చుకోకూడదు.

ఇప్పటికి దేశంలో పరీక్షలు అందుబాటులో లేక బయటపడని కేసులు లక్షల్లో ఉండొచ్చు. చాలామంది తమకు కరోనా సోకినా బయటకు చెప్పడం లేదు. అందుకే ఇపుడే మనం భరోసా ఫీల్ అవకూడదు. ప్రస్తుతం దేశంో రికవరీ రేటు 52 శాతానికి చేరింది. 

​టెస్టుల పరంగా కూడా కొత్త మైలురాయి నమోదు చేసింది ఇండియా. ​దేశంలో ఇప్పటివరకు 52,13,140 కరోనా టెస్టులు​ చేశారు. గడిచిన 24 గంటల్లో 1,51,808 టెస్టులు​ జరిగాయి. 

మహారాష్ట్రలో అత్యధికంగా 94,041 కేసులు​ నమోదు కాగా​,​ ​3438 మంది మృతి​ చెందారు ఇప్పటివరకు. తమిళనాడులో 36,841 కేసులు,​ ​326 మంది మృతి​. ఢిల్లీలో 32,810 కేసులు,​ ​984 మంది మృతి​. గుజరాత్ లో 21,521 కేసులు,1347 మంది మృతి​​ చెందారు. ​