ఇండియాలో మోస్ట్ డేంజరస్ ప్లేసులివే 

August 14, 2020

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని నగరాల్లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైంది. ప్రస్తుతం ఆ నగరాలు డేంజర్ స్టేజ్ కు చేరుకున్నాయని చెబుతున్నారు. ఆ ఖాతాలోకి మహారాష్ట్రలోని ముంబై.. పుణె.. మధ్యప్రదేశ్ లో ఇండోర్.. రాజస్థాన్ లో జైపూర్.. పశ్చిమబెంగాల్ లో కోల్ కతా.. హౌరా.. తూర్పు మిడ్నాపూర్.. నార్త్ 24 పరగణ.. డార్జిలింగ్.. జల్ పాయిగురి.. కలింపాంగ్ లలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలులో నిర్లక్ష్యం కనిపిస్తుందన్న ఆగ్రహంతో కేంద్రం ఉంది. ఇప్పటికైనా ఈ ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆయా రాష్ట్రాలకు ఉందని చెప్పక తప్పదు.  

చూస్తుండగానే దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వటమే కాదు.. పదుల కేసుల కాస్తా వందల కేసులుగా మారిపోవటం.. ఇప్పుడు వేలాది కేసులు నమోదు కావటం తెలిసిందే. ఎక్కడి దాకానో ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాల విషయాన్నే తీసుకుంటే.. ఒక్కో రాష్ట్రంలో దగ్గర దగ్గర 800 వరకు కేసులు నమోదు కాగా.. ఈ వారంతంలో వెయ్యి మార్కుకు దగ్గరగా వచ్చినా ఆశ్చర్యం లేదన్న మాట వినిపిస్తోంది. మరణాల రేటు తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నా.. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో అది కూడా ఎక్కువగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
లాక్ డౌన్ ను మే మూడు వరకూ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటం.. అదే సమయంలో మినహాయింపుల పేరుతో కొన్ని మార్గదర్శకాల్ని విడుదల చేయటం తెలిసిందే. దీన్ని అసరాగా చేసుకొని కొన్ని రాష్ట్రాలు చెలరేగిపోయిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. దేశంలోని అత్యంత డేంజర్ స్పాట్లుగా  పైన చెప్పిన ప్రాంతాల్ని తాజాగా పేర్కొన్నారు.