రెమెడిసివర్ : ఈ కరోనా మందు ఇక ఇండియాలోనే తయారీ

August 10, 2020

కరోనా ను అధిగమించడానికి మరో గుడ్ న్యూస్ ఇది. రోగం కంటే దాని వ్యాప్తి మనల్ని ఎక్కువ భయపెడుతోంది. అందుకే వ్యాప్తి తగ్గించడం కోసమైనా రోగాన్ని అరికట్టాలి. ఇందుకు ఇప్పటివరకు వాడిన మందుల్లో ప్రభావవంతమైనది రెమెడిసివర్ (remdesivir). 

కరోనా వైరస్‌ సోకి తీవ్రమైన లక్షణాలతో బాధపడే రోగులకు యాంటీ వైరల్ ఔషధం ‘ రెమెడిసివర్ (remdesivir)’ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తోంది. ఇది అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ అభివృద్ధి చేసిన ఔషధం. 

అమెరికా ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ఎఫ్‌డీఏ) ఇప్పటికే ఈ మందును అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. అనేక దశల్లో ఉపయోగించి సత్ఫలితాలు రాబట్టారు. ఈ ఔషధానికి ఇంకా తుది అనుమతులు రాలేదు. కానీ అన్ని ట్రయల్స్ పూర్తయ్యాయి.

దీంతో దీనిని విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారత్‌కు చెందిన కొన్ని ఫార్మా కంపెనీలతో గిలియడ్ సైన్సెస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల్లో సిప్లా, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, హెటెరో ల్యాబ్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని కంపెనీలు ఈ మందును మన హైదరాబాదులోనే తయారుచేయనున్నాయి.

ఇండియాలో ఉత్పత్తి ప్రారంభించబోయే ఈ కరోనా ఔషధాన్ని 127 దేశాల్లో ఎగుమతి చేయనున్నారు. అయితే, ఈ కంపెనీలకు ఇంకా భారత్‌లోని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించలేదు. అనుమతి త్వరలో వచ్చే అవకాశం ఉంది. 

రెమెడిసివర్ ఎక్కడిది, ఎవరు, ఎపుడు కనిపెట్టారు.... గతంలో నమస్తేఆంధ్ర రాసిన మరో సంపూర్ణ ఆర్టికల్ కింద చదవండి.

ఆ మందు వాడితే కరోనా దెబ్బకు పోతోంది !