కరోనాపై అదిరిపోయే రీమిక్స్ లు

August 05, 2020

సాహిత్యం ఒక్కోసారి చట్టాల కంటే బలంగా పనిచేస్తుంది. నమ్మశక్యంగా లేకపోయనా నిజమే ఇది. సరైన పద్దతిలో చెప్పేది ఏదైనా మనసుకు నచ్చుతుంది. చట్టం అంటే ఆర్డర్...మనం వినక తప్పదు. కానీ మనసుకు నచ్చింది కూడా ఎవరూ చెప్పకపోయినా చేస్తాం. అందుకే ఏ పోరాటంలో అయిన మనషుల్ని సాహిత్యమే ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అందుకు గవర్నమెంటు చెప్పినా వినకుండా రోడ్డు మీద తిరిగే వారి మనసు మార్చడానికి తాజాగా కీరవాణి తన పాత పాటను రీమిక్స్ చేశారు. ఇంట్లోనే ఉండండి అందరినీ సంతోషంగా ఉంచండి అంటూ ... స్టూడెంట్ నెంబర్ 1 పాటను రీమిక్స్ చేశారు.

 

అలాగే థిల్లానా థిల్లానా సాంగ్ ను కొందరు అద్భుతంగా రీమిక్స్ చేశారు. అది కూడా చూడండి. ఇప్పటికైనా మారండి. ఇంట్లో ఉండండి. ప్రమాదం గ్రహించండి.