పక్క రాష్ట్రపు ఐరన్ లేడీ... జగన్ ని ఉతికారేసింది

May 31, 2020

జగన్ మొండివాడు... జగన్ ఎవరి మాట వినడు అని అంటుంటారు. కొందరు మూర్ఖుడు అని కూడా తిడతారు. ఇది ప్రచారం కాదు... నిజం అని నిరూపించారు అన్నట్లు మాట్లాడారు సీనియర్ కాంగ్రెస్ లీడర్, జాతీయ నాయకురాలు రేణుకా చౌదరి. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె జగన్ గురించి పలు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూయర్ ... జగన్ గురించి ఆమె అభిప్రాయం అడగ్గా... చాలా నిట్టూరుస్తూ చెప్పారావిడ. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ కు అసలు ’’ప్రభుత్వం‘‘ అనే బేసిక్ కాన్సెప్ట్ అర్థం కావడం లేదని... అతనికి ఇంకేం అర్థమవుతుందని నిస్పృహగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రులు మారినా ప్రభుత్వం అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. మొదటి సారి... ఆ నిరంతర ప్రక్రియ ఆటంకం కలిగించిన వ్యక్తి జగన్ అన్నారు. 

9 నెలల పాలనపై కూడా స్పందించిన రేణుక... చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. జగన్ తన అజెండా ప్రకారం నడుచుకోవడం లేదని, రివెంజ్ పాలిటిక్స్ అనే పంథాలో కొట్టుకుపోతున్నారని విమర్శించారు. కక్ష రాజకీయాలు అత్యంత ప్రమాదకరమైన గేమ్ అని... దానిని ఎవరు స్టార్ట్ చేసినా అవి చాలా ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. అసలు ఏపీలో టైం పాస్ నడుస్తోంది. ఏం జరుగుతుందో తెలియని అయోమయం. పాలనలో శూన్యత ఉందన్నారు. చంద్రబాబును ఇబ్బందిపెడితే ప్రజల మనోభావాలు సంతృప్తి చెందుతాయా అన్నట్లు పాలన ఉందన్నారు. ప్రజల వాస్తవ దృక్పథం ముఖ్యమంత్రికి అర్థం కావడం లేదన్నారు. 

మూడు రాజధానుల విధానాన్ని కూడా ఆమె తప్పుపట్టారు. ఒక రాజధాని ఉంటేనే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటం లేదు. ఇక మూడు రాజధానులా... కాలయాపన పాలన తప్ప ఏం జరగడం లేదక్కడ అంటూ దానిని అంతటితో ముగించారు ఆవిడ. జగన్ పాలన గురించి అందరికీ అర్థమవుతుంది గానీ జగన్ కు మాత్రం అర్థం కావడం లేదు. చివరకు వైసీపీ క్యాడర్లో కూడా పలు చోట్ల అసంతృప్తి మొగ్గతొడిగింది.