రిజర్వేషన్లలో కొత్త యాంగిల్ - సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్

August 12, 2020

భారతదేశంలో రిజర్వేషన్ల రాజకీయ నాయకులకు ఉన్నంత ఉపయోగం ఆయా వెనుకబడిన వర్గాలకు ఉండటం లేదు. అనేక పార్టీలు ఈ టాపిక్ తోనే బతికేస్తున్నాయి. వాస్తవానికి రిజర్వేషన్ల కంటే మనిషికి ప్రాథమిక హక్కుల ద్వారానే ఉన్నంత ఎదుగుతాడు. కానీ అదేపనిగా జనాన్ని శాశ్వతంగా పైకి తీసుకువచ్చే ప్రాథమిక హక్కులను తొక్కిపెట్టే పార్టీలు వారికి తాత్కాలికంగా ఉపయోగపడే రిజర్వేషన్లను హైలెట్ చేస్తుంటాయి. 

దేశంలో అణగారిని ప్రజలు అభివృద్ధిలోకి రావడానికి 10 సంవత్సరాల కాలపరిమితితో  రాజ్యాంగంలో  వాటిని చేరిస్తే కాంగ్రెస్ పార్టీ తన స్వార్థం కోసం వాటిని పెంచుతూ వచ్చింది. చివరకు దానిని హక్కులా ఫీలయ్యే పరిస్థితికి తెచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై సంచన కామెంట్స్ చేసింది.

రిజర్వేషన్లు అనేవి ప్రాథమిక హక్కు కాదు అని, ప్రస్తుతం ఉన్న చట్టాలు అదే చెబుతున్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర్‌ రావు, జస్టిస్‌ కృష్ణమూర్తి, జస్టిస్‌ ఎన్‌ రవీంద్ర భట్‌ ధర్మాసనం ఈ కామెంట్లు చేసింది.

తమిళనాడులో మెడికల్‌ డిగ్రీ, పీజీ, డెంటల్‌ కాలేజీల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించడానికి కేంద్రం అడ్డపడుతోందని  సీపీఐ, డీఎంకే సహా పలు పార్టీల నేతలు సుప్రీంకోర్టులో పలు పిటిషన్లను దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్లు ఉపసంహరించుకని హైకోర్టుకు వెళ్లండని చెప్పింది.

ఇక రిజర్వేషన్ల కంటే ప్రాథమిక హక్కులు మనిషికి ఉన్నతిని ఎలా తెస్తాయి?

చదువు, ఆరోగ్యం ప్రాథమిక హక్కులు. పిల్లాడికి చదువు సరిగా చెప్పించకుండా రిజర్వేషన్లు ఉంచడం వల్ల... అణగారిన వర్గాల్లో కాస్త అవకాశం ఉండో, కాస్త డబ్బు ఉండో చదువుకున్న వారే బాగుపడుతున్నారు. పైగా ఈ రిజర్వేషన్లు కేవలం గవర్నమెంటుకే పరిమితం. గవర్నమెంటులో ఎన్నుంటాయి? 

నిజంగా అణగారిన వర్గాల మేలు రాజకీయ పార్టీలు కోరితే వారికి ఉచిత వైద్యం, నాణ్యమైన చదువు ఇస్తే... అప్పులు చేయకుండా మంచి చదువుకుంటారు. అలా చదువుకుంటే గవర్నమెంటు రిజర్వేషన్లు ఎవరూ అడగరు... వారంతట వారే గవర్నమెంటు ఉద్యోగాల కంటే మంచి ఉపాధిని ఇచ్చే ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడతారు. కానీ ప్రభుత్వానికి ఓటు కోణంలో ఇది పనికిరాదు. ఎక్కువ మంది బాగుపడటం కంటే తమ పార్టీ బాగుపడటం ముఖ్యం కాబట్టి రిజర్వేషన్లను మాత్రమే సమర్థిస్తాయి పార్టీలు.