​ఎస్... కియా ఏపీ నుంచి పోవాలనుకుంటోంది : రాయిటర్స్

August 08, 2020
CTYPE html>
రెండు రోజులుగా కియా విషయంలో రాయిటర్స్ సుడిగాలిని సృష్టించింది. కియా ఏపీ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతోంది అంటూ ఆ మీడియా రాసిన కథనం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా... ఏపీలో కలకలానికి దారితీసింది. ఏపీ ముఖ్యమంత్రికి చలిజ్వరం తెప్పించిన ఈ వార్తపై ఏపీ ప్రభుత్వం వణికిపోయింది. చివరకు ఆ కంపెనీ అధికారిక పీఆర్వీ నుంచి అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవని ప్రెస్ నోట్ రావడంతో దాంతో సంబరపడుతోంది వైసీపీ. అయితే... వారికి కొత్త షాక్ తగిలింది.
రాయిటర్స్ సారీ చెప్పినట్లు, తమ వార్త తప్పు అని పేర్కొన్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదని తేలిపోయింది. రాయిటర్స్ మరోసారి చిన్న కరెక్షన్ తో ఆ ట్వీటును మళ్లీ వేసింది. కియా మోటార్స్ సంస్థ 1.1 బిలియన్ డాలర్ల విలువైన ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి బయట రాష్ట్రానికి తరలించేందుకు చర్చలు జరుపుతోందని రాయిటర్స్ వార్తాసంస్థ మరోసారి కుండబద్దలు కొట్టింది. అంతేగాని...  మా వార్త తప్పు అని వారు పేర్కొనలేదు. అక్షర దోషం ఉన్న పాత ట్వీటును డిలీట్ చేసింది.  అయితే... దీనిని వైసీపీ తనకిష్టమొచ్చినట్లు ప్రచారం చేస్తోంది. వాస్తవం మాత్రం... ఇప్పటికీ రాయిటర్స్ .. కియా ఏపీలో ఉండదనే చెబుతోంది.