కేసీఆర్ పొత్తులపై గాలి తీసిన రేవంత్

August 14, 2020

ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో `పోతిరెడ్డిపాడు` వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పోతిరెడ్డి పాడు వ్యవహారంలో ఏపీకి అనుకూలంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణలోని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు అంశంపై తనను ప్రశ్నించిన ఓ జర్నలిస్ట్ ను కేసీఆర్ బెదిరించిన ఘటన చర్చనీయాంశమైంది. నాతోపెట్టుకోవద్దు అంటూ పోతిరెడ్డిపాడు అంశంపై అడిగిన జర్నలిస్టును కేసీఆర్ హెచ్చరించడంపై విమర్శలు వస్తున్నాయి.

ఈ ఘటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సాంకేతిక అంశాలు లేవనెత్తిన జర్నలిస్టులకు సమాధానం చెప్పకపోవడంతో పాటు బెదిరించడంపై రేవంత్ నిప్పులు చెరిగారు.  మా టెక్నికల్ గా ప్రశ్నలు అడిగితే కేసీఆర్ సమాధానం చెప్పకుండా దాటవేస్తారని, అడిగిన వారిని బెదిరిస్తారని విమర్శించారు. మీడియా సాక్షిగా కేసీఆర్ గాలి తీసేలా రేవంత్ తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో విమర్శలు, సెటైర్లు గుప్పించారు.

‘‘పోతిరెడ్డిపాడుపై సాంకేతికంగా ప్రశ్నలడిగితే సమాధానం చెప్పవు....బెదిరిస్తావు...నువ్వేమన్నా మొనగాడివా....నేను కూడా అదే ప్రశ్న అడుగుతున్నా..సమాధానం చెప్పు..ఒంగోబెట్టి రెండు దంచేటోళ్లు లేరు...ప్రెస్ కూడా ఏం మాట్లాడలేదు. పోతిరెడ్డిపాడుకు నీరివ్వడం వల్ల తెలంగాణకు నష్టం లేదని...ప్రభుత్వాన్ని చెప్పమనండి....ఇదేమిటని అడిగిన వ్యక్తులను దూషిస్తడు....పొత్తుల గురించి కేసీఆర్ మాట్లాడతడు....టీడీపీ,కాంగ్రెస్, బీజేపీ....ఇలా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఘనత కేసీఆర్ ది. 2011 ఎమ్మెల్సీ ఎన్నికల్లో దత్తాత్రేయ కడుపులో తలకాయ బెట్టి కాళ్లకు దండం పెట్టిండు కేసీఆర్.....కిషన్ రెడ్డి, లక్ష్మీనారాయణల ఓట్లు టీఆర్ఎస్ కు వేయించుకొని మూడు టీఆర్ ఎస్ ఓట్లను కాంగ్రెస్ కు అమ్ముకున్నడు....సిగ్గు తప్పిన కేసీఆర్ పొత్తుపెట్టుకోని పార్టీ ఏది?...

నీ కథ తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాం...కావాలంటే మీడియా మిత్రులు చరిత్ర తిరగేయండి.......ఆ సన్నాసి ఎప్పుడూ సెలక్షన్లు...ఎలక్షన్లు...కలెక్షన్లు తప్ప ఏం చేసిండు. ఆయన మందులో నిపుణుడు..ముందుచూపు కాదు మందు చూపు ఎక్కువ...కేసీఆర్ వచ్చినాక ఎత్తిపోతల పథకాలు వస్తాయంటే ఏందో అనుకున్న.....ఎత్తుడు పోసుడు తప్ప ఇంకేం లేదు`` అని కేసీఆర్ గాలి తీసేలా రేవంత్ తనదైన శైలిలో విమర్శించారు. మరి, రేవంత్ వ్యాఖ్యలకు కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.