రేవంత్ రెడ్డి ప్రశ్నలకు ఆన్సరుందా?

July 04, 2020

తెలంగాణ కాంగ్రెస్ నేత, ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి చాలాకాలం తర్వాత సుదీర్ఘ మీడియా సమావేశం పెట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు కురిపించారు. ఆ రెండు పార్టీలు ఉత్తుత్తి ఫైటింగ్ చేసుకుంటున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. గల్లీలో ఫైట్ చేస్తున్నట్లు ఇక్కడ నటన, ఢిల్లీలో స్నేహబంధం నడుస్తోందన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ఎప్పుడూ హాజరుకాని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి ఆర్టీఐ సవరణ బిల్లుకు మద్దతు పలకడం వెనుక ఆంతర్యం ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్, అమిత్ షా కలిసి నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

బీజేపీతో టీఆర్ఎస్ ఎప్పటికీ జతకట్టదన్న గుడ్డినమ్మకం పెట్టుకున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దీనిపై ఏం చెబుతారని రేవంత్ ప్రశ్నించారు. తాము టీఆర్ఎస్‌పై పోరాడుతున్నామన్న తెలంగాణ బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణలు భ్రమల్లో ఉన్నారా? వారు కూడా నటిస్తున్నారా అని ప్రశ్నించారు రేవంత్.

కేసీఆర్ మీద ఉన్న సహారా కేసు ఎంత వరకు వచ్చిందని, ఎందుకు దానిని ముందుకుపోకుండా అడ్డుకుంటోందని రేవంత్ రెడ్డి నిలదీశారు. మానవ అక్రమ రవాణా వ్యవహారంలో జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారని, అదే కేసులో ఉన్న హరీశ్ రావుకు మాత్రం నోటీసు కూడా పంపలేదన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మధ్య ఉన్న చీకటి ఒప్పందం కచ్చితంగా ఉందనది... ప్రజలు గుర్తించాలని రేవంత్ రెడ్డి కోరారు.


ఆయన ప్రెస్ మీట్ మొత్తం వివరాలు... video below