రవిప్రకాశ్ అరెస్ట్ కు... రేవంత్ కు లింకేంటి?

August 14, 2020

టీ టీడీపీ నుంచి టీ కాంగ్రెస్ లోకి రాగానే... వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకున్న యువ నేత రేవంత్ రెడ్డితో సావాసం చేయాలనుకుంటున్నారా? ఆయన ధైర్య సాహసాలను చూసి... ఆయనకు దగ్గరవుదామనుకుంటున్నారా? తెలంగాణలో అధికార పార్టీని అడ్డుకునే క్రమంలో రేవంత్ మినహా గత్యంతరం లేదని భావిస్తూ... రేవంతుడికి సాయం చేద్దామనుకుంటున్నారా? అయితే... కాస్త కాదు చాలానే ఆలోచించి అడుగు ముందుకేయాలి. లేదంటే... నేరుగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లక తప్పదు.నిజమా? అంటే... జరుగుతున్న పరిణామాలను, ప్రత్యేకించి టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ అరెస్ట్ ను ఓ సారి కాస్తంత లోతుగా పరిశీలిస్తే.. నిజమేనని ఒప్పుకోక తప్నదన్న మాట గట్టిగానే వినిపిస్తోంది. అయినా రవిప్రకాశ్ అరెస్ట్ కు, రేవంత్ రెడ్డితో స్నేహానికి ఏమిటి సంబంధం అంటారా? బయటకు ఏమీ కనిపించకపోయినా... కాస్తంత తరచి చూస్తే మాత్రం రేవంతుడికి సాయం చేయబోయి రవిప్రకాశ్ అడ్డంగా అరెస్టైపోయారట. 

ఆ కథాకమాకమీషు ఏమిటో చూద్దాం పదండి. టీ టీడీపీలో ఉండగానే టీఆర్ఎస్ పై తనదైన శైలి పోరాటం చేసిన రేవంత్ రెడ్డిని వ్యూహాత్మకంగా పట్టేసిన కేసీఆర్ సర్కారు ఏకంగా అరెస్ట్ చేసి పారేయడంతో పాటుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని అప్పటికప్పుడు విజయవాడ పారిపోయేలా చేసింది. అయినా తగ్గని రేవంత్ ను తమ దారికి తెచ్చుకునే యత్నాన్ని టీఆర్ఎస్ కాస్తంత గట్టిగానే చేసిందనే చెప్పాలి. ఆ క్రమంలోనే తమ దారికి వచ్చేందుకు ససేమిరా అన్న రేవంతుడిని ఓడించేందుకు టీఆర్ఎస్ తనదైన వ్యూహాన్ని అమలు చేసింది. అయితే రేవంత్ లాంటి నేత... ఈ తరహా బెదిరింపులకు జంకే సమస్యే లేదు కదా. అందుకే కాబోలు.. ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... టీఆర్ఎస్ లోకి కాకుండా టీ కాంగ్రెస్ లోకి వెళ్లారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా మల్కాజిగిరి ఎంపీగా కూడా గెలిచారు. అంతేకాకుండా ప్రస్తుతం హుజూర్ నగర్ అసెంబ్లీకి జరుగుతున్న బైపోల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాద్యతలను రేవంత్ భుజానికెత్తుకున్నారు. దీంతో టీఆర్ఎస్ మరోమారు రేవంతుడిని టార్గెట్ చేసిందట.

ఇక రవిప్రకాశ్ విషయానికి వస్తే... టీవీ 9 కొత్త యాజమాన్యం ఆయనను బయటకు గెంటేయడంతో పాటుగా ఏకంగా నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ, మోసం తదితర కేసులను నమోదు చేసింది. అయినా కూడా రవిప్రకాశ్ ను టీఆర్ఎస్ సర్కారు అరెస్ట్ చేయలేదు. ఏదో అలా పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఓ నాలుగైదు రోజులు విచారించి... సైలెంట్ గా ఉంటే సరే సరి... లేదంటే అరెస్ట్ తప్పదన్న వార్నింగ్ ఇచ్చి మరీ పంపించింది. సరే... ఎలాగూ కేసుల్లో ఇరుక్కుకున్నానన్న భావనతో రవిప్రకాశ్ కూడా సైలెంట్ అయిపోయారు. ఎంతైనా జర్నలిస్టిక్ బుద్ధి కదా... అంత ఈజీగా ఎలా సద్దుమణుగుంది? అందుకే ఇప్పుడు హుజూర్ నగర్ లో రేవంత్ బృందానికి సాయం అందించేందుకు రంగంలోకి దిగారట. రేవంత్ ప్రసంగాలను సిద్ధం చేయడంతో పాటుగా హుజూర్ నగర్ బైపోల్స్ లో కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ లోనూ కీలక భూమిక పోషించడం మొదలెట్టారట. 

ఈ మాట ఆనోటా, ఈనోటా బయటకు పొక్కి... నేరుగా టీఆర్ఎస్ పెద్దలకు చేరిపోయిందట. ఇంకేముంంది... ఫోర్జరీ, మోసం తదితర కేసులున్నప్పుడు కూడా అరెస్ట్ కాని రవిప్రకాశ్ మొన్న ఉన్నపళంగా అరెస్ట్ అయిపోయాడు. టీవీ 9 వివాదం సమయంలో అక్కడికి వెళ్లిన పోలీసులను అడ్డుకున్నారన్న ఓ చిన్న కేసు బూజు దులిపిన టీఆర్ఎస్ సర్కారు రవిప్రకాశ్ ను అరెస్ట్ చేసిందట. రవిప్రకాశ్ అరెస్ట్... ఏదో టీవీ 9 వివాదం కారణంగా కాకుండా రేవంతుడికి సాయం చేసినందుకే అరెస్ట్ అయిపోయారన్న విశ్లేషణలు ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయాయి. అంటే... మొత్తంగా తమకు బద్ధ విరోధిగా ఉన్న రేవంతుడికి ఎవరు సాయం చేసినా ఇలాంటి గతే పడుతుందన్న మాటను అందరికీ తెలిసేలా చేసేందుకే ఇప్పుడు టీఆర్ఎస్ సర్కారు రేవంతుడిని అరెస్ట్ చేసిందట. సో.. రేవంతుడికి సాయం చేయడానికో, ఆయనతో కొత్తగా స్నేహం చేయడానికి ఆసక్తి చూపేవారంతా ఇప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందేనన్న మాట.

ఇదిలా ఉండగా... తాజాగా రవి ప్రకాష్ ను రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి కలిసి వచ్చారు. 

Read Also

​బే ఏరియాలో ఘనంగా టీడీఎఫ్ బతుకమ్మ
సమ్మెను అణచివేత వెనుక అసలు నిజం చెప్పిన ఫైర్ లేడీ
గ్రామ వాలంటీర్లకు జగన్ మార్క్ దసరా కానుక