‘కరోెనాతో 10 వేల కోట్ల లక్ కొట్టేసిన కేటీఆర్‘

June 02, 2020

తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు రాష్ట్ర ఆదాయం జీరో అయ్యి ఉద్యోగుల జీతాలు సగం కోస్తే... మీరేంటి కేటీఆర్ లక్కీ అంటారు. కరోనా కాలంలో ఎవరికైనా లక్ ఉంటుందా? అని ప్రశ్నిస్తారేమో... అంతే కొందరికి ఏమైనా కలిసొస్తాయేమో. తాజాగా రేవంత్ రెడ్డి కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. కరోనా మనకు రోగం తెస్తే, కేసీఆర్ కుటుంబానికి అదృష్టం తెచ్చిందని ఆయన ఆరోపించారు. 

కేసీఆర్ బంధువులు డైరెక్టర్ గా ఉన్న ఫార్మా కంపెనీకి రూ.140 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ బంధువు పాకాల రాజేంద్రప్రసాద్ డైరెక్టర్ గా రాక్సెస్ లైఫ్ సైన్స్ ఇంతకాలం అనామక కంపెనీ. కానీ ఇక మీదట కాదన్నారు. ఎందుకంటే... కరోనా ఈ కంపెనీకి భారీ డీల్ ని తెచ్చిపెట్టందన్నారు రేవంత్.  హేమాహేమీలైన కంపెనీలను కాదని... ఈ కంపెనీకి హైడ్రాక్సీ  క్లోరోక్విన్ ఉత్పత్తి కోసం ఒక భారీ డీల్ కుదిరిందని, ఈ ఒప్పందం విలువ పది వేల కోట్ల రూపాయలు అని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు.

దేశంలో ఎన్నో పేరుపొందిన కంపెనీలున్నాయి. సుదీర్ఘ అనుభవం ఉన్న కంపెనీలున్నాయి. కోట్లలో ట్యాక్స్ లు కట్టే కంపెనీలున్నాయి. వాటికి దక్కని అదృష్టం కేసీఆర్ బంధువుల కంపెనీకి ఉత్తినే రాలేదని, కేటీఆర్, కేసీఆర్ మధ్యవర్తిత్వం చేస్తే ఈ డీల్ సెట్ అయ్యిందని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మరి రేవంత్ఆరోపణలకు కేటీఆర్ ఏమంటారో చూడాలి.