Mia మాల్కోవా : అసలు వీడియోలుండగా.. RGV వీడియోలు చూస్తారా?

August 04, 2020

మియా మాల్కోవా.. రామ్ గోపాల్ వర్మ మన సినీ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్న కొత్త కథానాయిక. ఆమె ప్రధాన పాత్రలో వర్మ ‘క్లైమాక్స్’ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే థియేట్రికల్ రిలీజ్‌కు అవకాశం లేకపోవడంతో వర్మ డిజిటల్ రిలీజ్‌కు సన్నాహాలు చేశాడు.

ఐతే వేరే ఏదో ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌తో డీల్ చేసుకోకుండా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరుతో సొంతంగా ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నాడు. అందులోకి వెళ్లి డబ్బులు కట్టి ఈ సినిమా చూడాలన్నమాట. మియా మాల్కోవా అందాలే ‘క్లైమాక్స్’కు ప్రధాన ఆకర్షణ. అంతకుమించి ఆ సినిమాలో ఏమీ లేదని ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. ఐతే వర్మ కెమెరాలో ఆమె అందాలు చూసేందుకు జనాలు ఏమాత్రం ఎగబడతారన్నది సందేహం.

మియా మాల్కోవా అందాలే చూడాలనుకుంటే బోలెడన్ని ‘అసలు‘ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఆ వెబ్ సైట్లు ఫ్రీగా వాటిని చూపిస్తున్నాయి. పో -! ర్న్ ! సినిమాలు చూసేవారికి మియా కొత్త ఏమీ కాదు. వర్మ సినిమాల క్వాలిటీ ఏ స్థాయికి పడిపోయిందో తెలుసు కాబట్టి.. ఈ సినిమా ఏమైనా బాగుంటుందన్న ఆశతో ప్రేక్షకులు డబ్బులు పెట్టి చూడటానికి సిద్ధమవుతారనుకుంటే అత్యాశే అవుతుంది. కేవలం మియా అందాలు, ఆమె రసభరిత వేషాల కోసమే చూడాలి.

కానీ నెట్లో ఫ్రీగా ‘అసలు‘ వీడియోలు దొరుకుతుండగా.. వర్మ గారి థియేటర్‌కు డబ్బులు పెట్టి ఎవరు వెళ్తారన్నది సందేహం. లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు లాంటి సిినిమాల విషయంలో వివాదాలు రాజేసి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలిడు కానీ.. ‘క్లైమాక్స్’ విషయంలో మాత్రం అదంత సులువు కాదు. దీనికి కూడా వేలం వెర్రగా ప్రేక్షకులు వచ్చి డబ్బులు కట్టి సినిమా చూశారంటే మాత్రం వర్మ సత్తాకు సలాం కొట్టాల్సిందే.