వర్మ... సెకండ్ సర్ ప్రైజ్

August 05, 2020

వర్మ క్రేజు వేగంగా తగ్గుతుండొచ్చు. కానీ వర్మ ఎప్పటికీ వర్మే. ఆరోజూ వర్మ పాఠమే. ఈరోజు వర్మ టాలీవుడ్ కి పాఠమే.

వర్మ ఇండస్ట్రీకి వచ్చినపుడు సినిమాలు ఎలా తీయాలో అందరికీ నేర్పాడు. సినిమాను కొత్తగా ఎలా చూపాలో నేర్పాడు.

ఈరోజు తన అనుభవసారాన్ని రంగరించి సినిమా ఎలా తీయకూడదో పాఠాలు నేర్పుతున్నాడు. ఈ సబ్జెక్టుపై ఇప్పటికే అనేక పాఠాలు నేర్పాడు వర్మ. తాజాగా మారుతీరావు కథతో మరో పాఠం రెడీ చేస్తున్నాడు.

వర్మ ఇండస్ట్రీకి పాఠాలు నేర్పడానికే ఉన్నాడు. 

నిన్న ఒక పనికిమాలిన ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో చెప్పాడు

ఈరోజు సెకండ్ లుక్ చండాలంగా ఉంటే ఎలా ఉంటుందో చెప్పాడు

ఫస్ట్, సెకండ్ లుక్ లో ఏ విషయం లేకపోతే విడుదల చేయకూడదు అన్నది వర్మ చెబుతున్న పాఠం.