వర్మను వాళ్లు బెదిరించారా?

May 24, 2020

మహిళా సంఘాలు కూడా భయపడి వదిలేసిన వ్యక్తి వర్మ. వాళ్లు భయపడింది పవర్ ని చూసి కాదు, అతని ​నోటి దురద చూసి. ఈ లోకంలో అన్నీ వదిలేసినోడు, అన్నిటికీ తెగించినోడు వర్మ. సిగ్గు ఎగ్గు అనే పదాలే తెలియని వ్యక్తి. అతనికి ఉన్నది ఒకటే.... ప్రాణభయం. అది తప్ప అతనికి ఏమీలేవు. ఇపుడు అధికార పార్టీ అండ ఉంది (?) అనుకుంటున్నాడు కాబట్టి ప్రాణభయం కూడా లేకుండా పోయింది. అందుకే ఇష్టారాజ్యంగా హద్దులు దాటి మాట్లాడుతున్నాడు.
నోటి దూల కొద్దీ ఒక కులాన్ని వర్మ టార్గెట్ చేశాడు. మరి పడినోడు ఊరికే ఉంటాడా? ఉండడు. కడుపులో మండి ఫోన్ చేసి బెదిరించారట. ఏవో దేశాల నెంబర్ల నుంచి ఫోన్ వచ్చాయట. ఎదురుగా వస్తే కుక్కులు అనకుంటాను. ఇలా చాటుమాటుగా బెదిరిస్తే మీరు నాకు దోమలు, ఈగలతో సమానం అంటూ కమ్మరాజ్యంలో కడపరెడ్లు హ్యాష్ టాగ్ పెట్టి ఓ పోస్టు పెట్టాడు. వర్మకు సిగ్గు, మానం మర్యాద లేకపోతే ఇతరులకు ఉంటాయి కదా. వారు ఇతనిలాగా రోడ్డెక్కి బరితెగించలేరు. తిట్టినందుకు అదుపులో ఉండమని చెబితే సిగ్గులేకుండా ఎదురుగా రా, వెనక్కి రా, ముందుకొచచి మొరుగు అంటున్నాడు.
సాధారణంగా ఎన్నికల సమయంలోనే ఏపీలో కులాల హడావుడి ఎక్కువుంటుంది. మిగతా సమయంలో అందరూ ఎవరి పనిలో వారు ప్రశాంతంగా ఉంటారు. కానీ వర్మ వచ్చి ఆ వాతావరణాన్ని ఏపీలో చెడగొట్టేలా ఉన్నాడు. ఇలాగే అదుపుతప్పి మాట్లాడితే... అసలే ఒక లక్ష్యంతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని భావిస్తున్న జగన్ కూడా ఇతనికి అడ్డుకట్ట వేసే ప్రమాదం లేకపోలేదు. వర్మ ఎందుకయినా మంచిది కొంచెం అదుపులో ఉంటే మంచిది.