మోడీ బ్యాచ్ కి కాలే ఫోటో పోస్ట్ చేసిన వ‌ర్మ‌

May 29, 2020

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తీరు మిగిలిన సినీ రంగ ప్ర‌ముఖుల‌కు భిన్నంగా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. వాళ్లు.. వీళ్లు అన్న‌ది చూడ‌కుండా త‌న‌కు న‌చ్చ‌ని వారినితిట్టేయ‌టం.. తాను మెచ్చిన వారిని తెగ పొగిడేయ‌టం వ‌ర్మ‌కు అల‌వాటే. అదే స‌మ‌యంలో.. త‌న‌కు న‌చ్చిన ఫోటోల్ని ఆయ‌న పోస్ట్ చేసేస్తుంటారు. ఎలాంటి అన‌వ‌స‌ర వ్యాఖ్య చేయ‌ని వ‌ర్మ‌.. తాజాగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో సంచ‌ల‌నంగా మారింద‌ని చెప్పాలి. తాజాగా ఆయ‌న పోస్ట్ చేసిన ఫోటో మోడీ బ్యాచ్ కు మంట పుట్టేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
ఇప్ప‌టివ‌ర‌కూ త‌న రాత‌ల‌తో మంట పుట్టించిన వ‌ర్మ‌.. తాజాగా మాత్రం ఒక ఫోటోతో చాలా విష‌యాల్ని చెప్పేసిన‌ట్లుగా ఉంద‌ని చెప్పాలి. ఆ ఫోటోకు క్యాప్ష‌న్ గా.. సేమ్ టు సేమ్ అని పేర్కొన్నారు. త‌న తాజా మూవీ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మే1 ముహుర్తంగా వ‌ర్మ ఫీలైనా.. ఎన్నిక‌ల సంఘం మాత్రం మ‌ళ్లీ తాము చెప్పే వ‌ర‌కూ స‌ద‌రు సినిమాను ఏపీలో రిలీజ్ చేయొద్ద‌ని తేల్చేశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా వ‌ర్మ పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు అంద‌రి దృష్టి ప‌డేలా ఉంది. జ‌ర్మ‌నీ నియంత హిట్ల‌ర్ కు చెందిన ఫోటోలో.. ఒక చిన్నారి చెవులు ప‌ట్టుకున్న ఫోటోను పోస్ట్ చేసి.. అదే రీతిలో మ‌రో చిన్నారి చెవుల‌ను ప‌ట్టుకున్న మోడీ ఫోటోను పోస్ట్ చేశారు. సేమ్ టు సేమ్ అన్న క్యాప్ష‌న్ లో చెప్పాల‌నుకున్న చాలా విష‌యాల్ని సింఫుల్ గా చెప్పేసిన ప‌రిస్థితి. మ‌రి.. దీనిపై మోడీ ప‌రివారం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.