రోడ్డున పడిన రాంగోపాల్ వర్మ

May 31, 2020

ఊరికే ప‌బ్లిసిటీ గిమ్మిక్కులు చేసి త‌న సినిమాను సేల్ చేసుకుంటాడ‌ని.. జ‌నాల్ని పిచ్చోళ్ల‌ని చేస్తుంటాడ‌ని రామ్ గోపాల్ వ‌ర్మ‌ను చాలామంది తిట్టేస్తుంటారు. కొన్నేళ్లుగా వ‌ర్మ సినిమాలు ఎంత నాసిర‌కంగా ఉంటున్నాయో తెలిసిందే. అయినా స‌రే.. ఏదో ఒక వివాదం రాజేసో.. ఇంకేదో గిమ్మిక్కు చేసో సినిమా ప‌ట్ల జ‌నాల్ని ఆక‌ర్షితుల్ని చేస్తున్నాడు వ‌ర్మ‌. కానీ అన్నిసార్లూ ఆయ‌న ప్లాన్లు వ‌ర్క‌వుట్ కావ‌ట్లేదు. ఆఫీస‌ర్ లాంటి సినిమాలు కొన్ని ఎలా బోల్తా కొట్టాయో తెలిసిందే. ఇప్పుడు రొమాంటిక్ సినిమా ప‌రిస్థితి ఇంకా ద‌య‌నీయంగా ఉంది. ఈ సినిమాను సేల్ చేయ‌డానికి వ‌ర్మ వేయ‌ని ఎత్తుగ‌డ లేదు. హీరోయిన్‌తో ఎంత ఎక్స్‌పోజింగ్ చేయించినా.. ఎలాంటి ట్రైల‌ర్లు వ‌దిలినా సినిమాను జ‌నాలు దేక‌ట్లేదు.
దీంతో ఈ సినిమా కోసం ర‌క‌ర‌కాల ఈవెంట్లు పెట్టి వ‌ర్మ విచిత్ర‌మైన విన్యాసాలు చేస్తున్నాడు. కొన్ని రోజుల కింద‌ట ప్రి రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్‌తో క‌లిసి స్టెప్పులేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. త‌ర్వాత హైద‌రాబాద్‌లోని ఒక షాపింగ్ మాల్‌లో ఏదేదో మాట్లాడాడు. అమ్మాయిల‌తో క‌లిసి పిచ్చి డ్యాన్సులేశాడు. ఇవ‌న్నీ చాల‌వ‌న్న‌ట్లు త‌న ఫేవ‌రెట్ డ్రింక్ వోడ్కాను కూడా ప్ర‌చారానికి వాడేస్తూ ఆదివారం రాత్రి ఒక కార్య‌క్ర‌మం ఏర్పాటుచేశాడు వ‌ర్మ‌. వోడ్కా విత్ బ్యూటిఫుల్ టీం అంటూ ఓ ప్రోగ్రాం పెట్టాడు వ‌ర్మ‌. ఇందులో భాగంగా వ‌ర్మ‌, బ్యూటిఫుల్ సినిమా హీరో హీరోయిన్లు, ద‌ర్శ‌కుడితో క‌లిసి క‌లిసి వోడ్కా డ్రింక్ తాగొచ్చ‌ట‌. దీనికి ఫేస్ బుక్ లైవ్ కూడాన‌ట‌. దీనికి కొంద‌రు ప్ర‌ముఖుల్ని కూడా పిలిపించి ఏదో హ‌డావుడి చేశాడు వ‌ర్మ‌. కానీ ఇవేవీ కూడా సినిమా ప‌ట్ల అయితే జ‌నాల్లో ఆస‌క్తి పెంచే సంకేతాలైతే క‌నిపించ‌డం లేదు.