అమెరికన్ ని పెళ్లిచేసుకున్న తెలుగు హీరోయిన్

May 26, 2020

తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలతో నటించి సడెన్ గా గాయబ్ అయిన రిచాగంగోపాధ్యాయ ... అనుకోకుండా సోషల్ మీడియాలో ఈరోజు సందడి చేస్తోంది. ఏంటి కొత్త సినిమాలో నటిస్తుంది అనుకుంటున్నారేమో.. కాదు, ఆమె పెళ్లి చేసుకుని అందరినీ సర్ ప్రైజ్ చేసింది. పెళ్లి కొడుకు ఒక అమెరికన్ కావడం విశేషం. 

రిచా గంగోపాధ్యాయ రవితేజ, ప్రభాస్ తదితరులతో కలిసి నటించింది. ప్రభాస్ మిర్చి సినిమా ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఏడాది క్రితం నిశ్చితార్థం చేసుకుని ఇపుడు పెళ్లాడింది. వరుడు అమెరికన్ అయిన ’జో’ ను పెళ్లాడింది. వీరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. ఇరు కుటుంబాల సమక్షంలో క్రైస్తవ హిందు సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిగింది. టాలీవుడ్ నుంచి ఎవరినీ ఆమె పిలవలేదు. కేవలం బంధుమిత్రులను మాత్రమే పిలిచారు. త్వరలో టాలీవుడ్ కోసం ఒక రిసెప్షన్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.