కాలం మారింది. తెల్లోళ్లకు ఆర్థికమంత్రి మనోడే..

August 07, 2020

కాలం మారింది. వందల ఏళ్లు మనల్ని పాలించిన తెల్లోళ్లకు మనోడే విత్త (ఆర్థిక) మంత్రిగా ఎంపిక చేస్తూ బ్రిటన్ ప్రధాని తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అంతేనా.. మరో ఇద్దరు భారత సంతతికి చెందినోళ్లు బ్రిటన్ మంత్రులుగా నియమితులయ్యారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఆర్. నారాయణమూర్తి అల్లుడు.. ఎంపీ రిషి సునక్ ను బ్రిటన్ ఆర్థికమంత్రిగా ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే బ్రిటన్ హోంమంత్రిగా భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ కొనసాగుతున్నారు. వీరితో పాటు 52 ఏళ్ల అలోక్ శర్మ.. 39 ఏళ్ల సుయెల్లా బ్రేవర్ మన్ లను మంత్రివర్గంలో తీసుకున్నారు. అలోక్ శర్మకు వాణిజ్య.. ఇంధన.. పారిశ్రామిక శాఖలకు మంత్రిగా నియమిస్తూ.. సుయెల్లాను అటార్నీ జనరల్ గా ఎంపిక చేశారు.
రిషి ఎంపిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని నిర్ణయంపై రిషి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ..  తన తల్లిదండ్రులు తన చదువు కోసం ఎంతో త్యాగం చేశారన్నారు. అంతర్జాతీయ సంస్థల్లో చదువుకునే అవకాశం రావటం తన లక్ గా పేర్కొన్నారు. ఈ సమయంలోనే నారాయణమూర్తి కుమార్తె అక్షతా ఆయనకు పరిచయమయ్యారు. తర్వాతి వారి మధ్య ప్రేమ చిగురించటం.. పెళ్లాడటం జరిగింది. వారి పెళ్లి తర్వాత బ్రిటన్ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు.
కన్జర్వేటివ్ పార్టీలో చురుకైన పాత్ర పోషించటంతో.. అతి తక్కువకాలంలోనే బోరిస్ జాన్సన్ కంట్లో రిషి పడ్డారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ బయటకు రావాలన్న ప్రధాని నిర్ణయాన్ని బలంగా సమర్థించారు. రాజకీయాల్లోకి రాక ముందు.. అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థను ఏర్పాటు చేసిన ఆయన.. చిన్న వ్యాపారాల్లో మదుపు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. బ్రిటన్ ఆర్థిక మంత్రిగా పాక్ మూలాలున్న సాజిద్ జావిద్ దగ్గర రిషి ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఎన్నిక కావటం.. సాజిద్ కు ఆయనతో వ్యక్తిగత విభేదాలతో పాటు.. వివిధ అంశాలు తోడు కావటంతో రిషిని ఆర్థికమంత్రిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన బాస్ పదవినే రిషి సొంతం చేసుకున్నారని చెప్పాలి. ఏమైనా.. మనల్ని పాలించిన తెల్లోళ్లకు మనోడు ఆర్థికశాఖ మంత్రిగా ఎంపిక కావటం ఆసక్తికరంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రధాని పదవి తర్వాత అత్యంత కీలకమైన ఆర్థికమంత్రిగా రిషిని ఎంపిక చేయటం పట్ల బ్రిటన్ రాణి ఎలిజబెత్ సంతోషాన్ని వ్యక్తం చేసినట్లుగా ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొనటం గమనార్హం.

Read Also

విశాఖపై పగ -తల్లిని ఓడించినందుకు కక్ష
వివేకా కేసు : జగన్ కి ఊహించని షాకిచ్చిన టీడీపీ 
పోలవరంపై నారా లోకేష్‌కు అడ్డంగా దొరికిపోయిన జగన్