తిన్న పకోడీలకు రూ.5 అడిగితే.. తుపాకీతో కాల్చేశాడు

July 15, 2020

దేశంలో వివిధ రాష్ట్రాల్లో క్రైం వివిధ రూపాల్లో ఉంటుంది. కానీ.. బిహార్.. ఉత్తరప్రదేశ్ లో మాత్రం మిగిలిన రాష్ట్రాలకు భిన్నం. ఇక్కడ జరిగే నేరాలకు సంబంధించిన కారణాలు తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సింది. తాజాగా వెలుగు చూసిన ఉదంతం ఈ కోవకు చెందినదే. బిహార్ లో తాజాగా తిన్న పకోడీలకు రూ.5 అడిగితే.. మా అన్ననే డబ్బులు అడుగుతావా? అంటూ అతడి సోదరుడు తుపాకీతో పకోడీలు అమ్మే వ్యాపారిని కాల్చేసిన వైనం సంచలనంగా మారింది.
బక్సర్ జిల్లాలోచోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. గోలు యాదవ్.. చున్ను యాదవ్ ఇద్దరు సోదరులు. వారిద్దరూ రోడ్డు పక్కనున్న చిన్న దుకాణంలో పకోడీలు తిన్నారు. అందుకు రూ.5 అడిగారు. దీంతో వ్యాపారికి ఈ సోదరులకు గొడవ చోటు చేసుకుంది. స్థానికి స్పందించి.. సర్దిచెప్పటంతో వారు వెళ్లిపోయారు.
తర్వాతి రోజు తుపాకీతో వచ్చిన సోదరులు.. పకోడీ తిన్నందుకు డబ్బులు అడుగుతావా? అంటూ కాల్పులు జరిపాడు. యజమాని కాలిపై బుల్లెట్ దించటంతో.. అతడ్ని అడ్డుకునేందుకు వ్యాపారి సోదరుడు ప్రయత్నించగా.. అతడి కాలులోకి మరో బుల్లెట్ దింపాడు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. సిత్రమైన విషయం ఏమంటే.. పకోడీలకు ఇవ్వాల్సిన రూ5 కంటే కూడా తుపాకీ బుల్లెట్లు ఖరీదైనవి. దానికి తోడు.. అదనంగా కేసు మీద పడటం గమనార్హం.

RELATED ARTICLES

  • No related artciles found