చంద్రబాబు కట్టిన రోజా ఆఫీసు చూశారా మీరు?

May 26, 2020

అమరావతిలో ఒక్క ఇటుక కూడా చంద్రబాబు వేయలేదు - జగన్

అది అమరావతి కాదు, గ్రాఫిక్స్ తో కట్టిన భ్రమరావతి - రోజా

రోజా గారు... కొత్త పదవి వచ్చిందటగా. మాంచి ఖుషీలో ఉన్నారు. అవును... మరి పాపం గ్రాఫిక్స్ లో సృష్టించిన భ్రమరావతిలో పాపం కుర్చీ, టేబుల్ ఏ చెట్టు కింద వేసుకుంటావు? వర్షమొస్తే ఇబ్బంది కదా. అసలు అక్కడ అమరావతే లేదని మీ నాయకుడన్నాడు. అది భ్రమరావతి అని మీరన్నారు. మరి మీకు పోస్టు అయితే వచ్చింది గాని...మీకు ఆఫీసు లేదటగా. 

మీరు కంగారు పడకండి. ప్రజలకు చెవుల్లో జోరీగల్లా చేరి పదే పదే అబద్ధాలు చెప్పి చెప్పి జనాన్ని నమ్మించి మోసం చేశారు వైసీపీ నేతలు. అమరావతి రాని వాళ్లకు నిజంగా అక్కడేమీ లేదన్నట్లే భ్రమింపజేశారు. కానీ 175 ఎమ్మెలు  చక్కగా కూర్చుని సమావేశాలు పెట్టుకోవడానికి సకల సదుపాయాలతో అసెంబ్లీ కట్టాడు. కానీ... ప్రపంచం గర్వించే అసెంబ్లీని కడదాం అని ప్లాన్ వేయిస్తే దాన్ని తప్పు పట్టారు వైసీపీ నేతలు. అన్నిటికీ అనుకూలమైన తెలంగాణ సచివాలయం కంటే మిన్నగా ఉండే సచివాలయం కట్టాడు. కానీ దానితో సంతృప్తి చెందితే ప్రపంచం నివ్వెరపోయే పరిపాలన భవనం కట్టుకోలేం అని చంద్రబాబు ప్లానేస్తే దానిని తప్పు పట్టారు. అమరావతి నుంచి పాలన కొనసాగించడానికి అనుకూలమైన ప్రతి భవనం చంద్రబాబు అమరావతిలో కట్టాడు. ఒకవైపు చంద్రబాబు అమరావతిలో ఏం కట్టాడో చెప్పుకోలేకపోయారు. కానీ వీళ్లు మాత్రం అక్కడేమీ లేదని సక్సెస్ ఫుల్ గా నమ్మిస్తూ వచ్చారు. తీరా అక్కడే ఫొటోలు దిగి రోజు సోషల్ మీడియాల్లో పెట్టుకుంటున్నారు. 

తాజాగా ఏపీఐఐసీ ఛైర్మన్ గా రోజా కి పదవిచ్చిన సంగతి తెలిసిందే కదా. దానికి అద్భుతమైన 11 అంతస్తుల భవంతి ఉందని మీకు తెలుసా? 2.26 ఎకరాల్లో 110 కోట్లతో కట్టారని, అది అత్యాధునిక భవనం అని మీకు తెలుసా? అందులో 3 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ ఉందని తెలుసా? దానిని కొన్ని నెలల క్రితం ఫిబ్రవరిలో ప్రారంభించారని మీకు తెలుసా? దానిని వన్ స్టాప్ ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ సెంటర్ గా సకల సదుపాయాలతో మలిచారని తెలుసా? ఈ భవంతికి తోడు పక్కనే టవర్ - 2 కడుతున్న విషయం మీకు తెలుసా? ఆ భవంతిలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రం కళ్లక కట్టేలా తీర్చిదిద్దారని తెలుసా? 

ఒక వేళ మీకు ఇవన్నీ తెలిస్తే రోజాకు చెప్పండి. అమరావతిలో ఏమీ లేదని ఏ చెట్టుకిందయినా ఆఫీసు పెట్టేసుకుంటుందేమో. ఇంకో విషయం ఇది చంద్రబాబు హయాంలో కట్టినదని చెప్పండి.