​లోకేష్ పై సెటైర్లు రోజా వేస్తే ఎలా ​?

April 03, 2020

మనిషి లాజిక్ దాటి మాట్లాడకూడదు. బలం, మద్దతు ఉందని మాట్లాడితే అది తాత్కాలిక బలప్రదర్శన అవుతుంది. మండలి రద్దు సందర్భంగా రోజా వ్యవహరించిన తీరు ఇలాగే ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో మండలి రద్దు బిల్లు ప్రవేశపెడితే...తెలుగుదేశం సభ్యులకు ఆ బిల్లును బహిస్కరించి సమావేశానికి హాజరుకాలేదు. ప్రజావ్యతిరేక  నిర్ణయాలకు అడ్డురాకూడదనే అక్కసుతో జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయంపై చర్చించడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు అని కొట్టిపారేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఈ విషయాన్ని రోజా ప్రస్తావిస్తూ... అక్కడెక్కడో మాట్లాడేబదులు సభలో ఉండి మాట్లాడవచ్చుగా అని విమర్శించారు రోజా. మరి...ఒక సమావేశంలో ఒకరోజు రాకపోతే ఈ మాటలు మాట్లాడుతున్న రోజా గత సమావేశాల్లో ఏడాదికిపైగా జగన్ అసెంబ్లీని ఎగ్గొట్టి బయట మాట్లాడిన విషయం తెలియలేదా? చరిత్ర మరిచిపోతే ఎలా ఎమ్మెల్యే రోజా గారు?

ఈ సందర్భంగా రోజా లోకేష్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పెద్దల సభకు ఇంట్లో ఉన్న దద్దమ్మను, దద్దోజనాన్ని పంపించారు అని తీవ్రంగా విమర్శించారు. ఈ మాట మాట్లాడేముందు రోజా కనీసం ఆలోచించలేదా అని సాధారణ ప్రజలు భావిస్తున్నారు. లోకేష్ మాస్టర్స్ చదివారు. మంత్రిగా పనిచేసిన సమయంలో అతను మెరుగైన పనితీరు కనబరిచారని అనేక అవార్డులు కేంద్రమే ఇచ్చింది. ఆ అవార్డులు పక్కన పెడితే... ఏ సబ్జెక్టులో అయినా... లోకేష్ కు ఉన్న సబ్జెక్టు రోజాకు లేదు. రాష్ట్రం గురించి కావచ్చు, ఇంక దేనిగురించి అయినా కావచ్చు. రోజాకు తెలుగు కాస్త సరళంగా రావచ్చు. ఆమె తెలుగుమీడియం. లోకేష్ ఇంగ్లిష్ సరళంగా మాట్లాడగలరు అతనిది ఇంగ్లిష్ మీడియం. ఒక సారి లోకేష్ తో ఏ విషయంపై అయినా మాట్లాడి వాదించి గెలిస్తే అపుడు రోజా ఇలాంటి వ్యాఖ్యలు చేసినా అంగీకరించొచ్చు. కానీ... ఒక మనిషి గురించి అతను లేనిచోట అబద్ధాన్ని నిజంలా ప్రచారం చేయడం, ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే హోదాలో ఉన్న రోజాకు సముచితమేనా? ఇది కామన్ మాన్ ప్రశ్న.