అంబులెన్సు నడిపిన రోజా

August 12, 2020

కీలకమైన వైద్య సదుపాయాల్లో ఒకటైన అంబులెన్స్ తో వైసీపీ ప్రభుత్వం ఆటలు ఆడుకుంటోంది.

ఇపుడు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న సర్వీసులనే తాను కొత్తగా ప్రవేశపెడుతున్నట్టు భారీ ర్యాలీ తీసి దాని ప్రచారానికి కోట్లు ఖర్చు పెట్టి మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చిన ఏపీ సర్కారు ప్రచార వాహనాల్లా వాటిని సైరన్లతో తిప్పుతోంది.

నిబంధనల ప్రకారం పేషెంట్ ఉన్నపుడు గాని, లేదా పేషెంట్ కోసం వెళ్లేటపుడు గాని సైరన్ వేయాలి. కానీ వైసీపీ ప్రభుత్వం దానిని పబ్లిసిటీ సైరన్ గా మార్చేసింది.

ఇదే ఎక్కువ అనుకుంటే కాంట్రవర్సీ క్వీన్ నగరి ఎమ్మెల్యే రోజా రెడ్డి మరో వివాదాస్పద పనిచేశారు.

తమ ప్రాంతానికి కేటాయించిన అంబులెన్సులను మళ్లీ ప్రారంభిస్తూ తాను డ్రైవింగ్ సీట్లో కూర్చుని నడిపారు.

సైరన్ వేసుకుని ఒక ఎమ్మెల్యే అంబులెన్సుని నడపటం నిబంధనలకు విరుద్ధం.

కానీ ఏపీ ప్రభుత్వంలో ఏం చేసినా అడిగేవారెవరు? 

మొత్తం నగరికి ఐదు 104 లు, ఐదు 108 లు కేటాయించారు.

ఒకటో తేదీ ప్రారంభిస్తే అవి నగరికి చేరుకోవడానికి ఏడురోజులు పట్టడం విచిత్రం.

ఒక్క రాత్రికి ఇక్కడికి చేరుకోవాల్సినవి... ఇంతకాలం ఏం చేశారో తెలియని పరిస్థితి.

చంద్రబాబు నిందలు వేస్తున్నారని అంబులెన్సుల్లో ఎలాంటి అవినీతి జరగడం లేదన్నారు.

చంద్రబాబు ఇలాగే చేస్తే వచ్చే ఎన్నికల్లో 23  సీట్లు కూడా రావన్నారు.