వైసీపీ నేతల అహంకారం

April 02, 2020

ఒక్క వనజాక్షిని ఒక ఎమ్మెల్యే పక్కకు ఈడ్చి పడేయడం తప్పే. అది అతన్ని దండించదగిన నేరం. 

రాజధానిలో 29 వేల మందిని పోలీసు బలం, డబ్బు బలం, బౌన్సర్ల బలంతో ఈడ్చి పడేసి, చీరలు లాగేసి, లాఠీలతో బాదేసిన పోలీసులను, వారి చేత అలా చేయించిన ముఖ్యమంత్రి జగన్ ను ఏం చేయాలి? పోలీసు బాసుకు ఏ శిక్ష వేయాలి?

అంత మంది కడుపు రగిలి, సర్వం కోల్పోయి న్యాయం కోసం దీక్ష చేస్తుంటే వారిపై అబద్ధపు కూతలు, అహంకారపు కూతులు కూస్తున్న వైసీపీ నేతలకు ఏ శిక్ష వేయాలి. ఇదింకా సాగుతూనే ఉంది. 

ఈరోజు ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీకి వచ్చిన రోజాను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. మాకు న్యాయం చేయకుండా మీరు పండగలు చేసుకుంటున్నారు. మీకు ఏం ద్రోహం చేసింది అమరావతి. రాజధాని కదల్చొద్దు. ఏపీని నాశనం చేయొద్దు అంటూ నినదిస్తూ రోజా కారును అడ్డుకున్నారు. అయితే.... పోలీసుల జోక్యంతో ఆమె బయటపడ్డారు. దీనిపై తీవ్రంగా ఆగ్రహించిన రోజా మరోచోట మీడియాతో మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యల్లో అడగడుగునా గర్వం పొగరు తాండవిచ్చాయి. 

చంద్రబాబు నాపై దాడికి కుట్ర చేశారు. ఒక ఎమ్మెల్యేని అడ్డుకుంటారా? ఏమనుకుంటున్నారు. నేను తలచుకుంటే చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర ఒక ఇంచు కూడా కదలదు అని రోజా వార్నింగ్ ఇచ్చారు. తనను అడ్డుకున్న వారంతా టీడీపీ గూండాలు అంటూ ఆమె మండిపడ్డారు. ప్రజలు ఓట్లేస్తే రోజా ఎమ్మెల్యే అయ్యారు. ఓట్లేసి గెలిపించిన నేతలుదారి తప్పితే అడ్డుకోవడం కాదు, పదవి నుంచే పీకేసే శక్తిని ప్రజలకు ప్రజాస్వామ్యం ఇచ్చింది. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ప్రజా సేవకు బానిసలు.  ఆ విషయం మరిచిపోతే ప్రజలు రాజకీయాల్లో పుట్టగతులు లేకుండా చేస్తారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి రోజా గారు. ఒక మహిళను ఒక వ్యక్తి లాగిపడేస్తేనే ప్రజాస్వామ్యం కాదు నేర స్వామ్యం అని గగ్గోలు పెట్టినవారు. వేల మంది స్త్రీలను రెండు నెలలుగా వేధిస్తూ ఏడిపిస్తూ.. పాకిస్తాన్ బార్డరులో పెట్టిన సెక్యూరిటీ కంటే ఎక్కువ సెక్యూరిటీ పెట్టి హింసిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? 

బొత్స సత్యనారాయణ, ఆళ్ల, రోజా, జోగి రమేష్...ఒక్కొక్కరు ఒక్కో విధంగా రైతులను ఏపీ ప్రజలను అవమానిస్తున్నారు. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా... రాజ్యాంగం ఇచ్చిన ఏ పదవిలో ఉన్నా వారు ప్రజలందరికీ బాధ్యులు గాని ఏ వర్గానికో బాధ్యులు కాదని గుర్తుపెట్టుకోవాలి.