అవును... జగనన్నను రోజా తప్పు పట్టింది!

August 04, 2020

కాలం అందరి దూల తీరుస్తుంది. రాజకీయాలకు విలువల పొర ఎపుడో చెరిగిపోయింది. సమర్థుడైన వాడిని ఈ ప్రపంచం అడ్డుకోలేదు. అసమర్థుడిని ఈ ప్రపంచం ఎన్నటికీ సమర్థుడిగా నిరూపించనూ లేదు. నేడు ప్రతినిత్యం చంద్రబాబును తక్కువ చేసి చూపేందుకు వైసీపీ కనీసం ఒక 20 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను నియమించుకుంది. బాబును తిట్టేవారందరికీ విజయ సాయిరెడ్డి లీడరు లాంటోడన్నమాట. వీరి గెలుపు సూత్రం ఒకటే .... జగన్ కి జాకీలేయడం కన్నా... బాబును డ్యామేజ్ చేయడం ద్వారానే జగన్ కి గుర్తింపు వస్తుందన్న బండ సూత్రాన్ని కనిపెట్టేశారు. ఎందుకంటే మంచి వాడిని చెడ్డవాడిగా నిరూపించడం సులువు కదా. అందుకే !!

1500 కోట్లు సొంత డబ్బు ఇచ్చిన టాటా చేసుకోనంత ప్రచారం... ప్రజల డబ్బును పప్పు బెల్లాల్లా పంచుతున్న జగన్ చేసుకుంటున్నాడు. ఏ అభివృద్ధి పని చేసి ఉంటేనో ఇలా ప్రచారం చేసుకుంటే ఆయన ఏం చెప్పుకుంటే ఏమి మన రాష్ట్రానికి కావల్సింది జరిగింది అనుకోవచ్చు.

జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం, జగన్ పంచే ప్రతి రూపాయి కేవలం ఓటు కోసమే గాని రాష్ట్రం కోసం కాదు. ఖజానాను ఖాళీ చేసి శభాష్ అనిపించుకుంటే భావి తరాలు మొత్తం అడుక్కుతినాలి. పక్క రాజ్యంలో పండ్లు కొని ప్రజలకు పంచడం కాదు. మన రాష్ట్రంలో పండ్ల చెట్లు నాటిన వాడు హీరో అవుతాడు. 

కానీ సామాన్య జనాలు పనిచేయించి పండ్లు తెంపుకుని తినమని చెప్పేవాడి కంటే మీ ఇంట్లో మీరు కూర్చోండి నేను పండ్లు పంపిస్తా అంటే సంతోషించరా? సంతోషిస్తారు. మరి భవిష్యత్తు ఏంటి.?? ఇది ఏపీలో ప్రతి పౌరుడు ఆలోచిస్తేనే ఏపీకి భవిష్యత్తు. ముఖ్యమంత్రి ఎవరన్నది కాదు... ఏపీకి ఏం చేశాడన్నది ఇంపార్టెంటు. ఈ విషయంలో మేలుకోకపోతే తరతరాలు ఏడవాల్సి వస్తుంది.

ఈ సందర్భంగా రోజా గురించి ఇక్కడ కచ్చితంగా చెప్పుకోవాలి. ఇతరులు అధికారంలో నోటికొచ్చినపుడు మాట్లాడితే... పాయింట్ లేకుండా మాట్లాడితే మనం అధికారంలోకి వచ్చినపుడు దాని ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో కింద ఉన్న రోజా మాటలే సాక్షి. వీడియో  కోసం కింద లింకు క్లిక్ చేయండి. చంద్రబాబు హయాంలో రోజా చేసిన ప్రతికామెంటు జగన్ కి చెంపపెట్టులా ఎలా మారిందో...మిమ్మల్ని సర్ ప్రైజ్ చేసే వీడియో ఇది

https://www.facebook.com/220486867996231/videos/177589703432400/