రోజా ప‌గ‌లు పొలిటీషిన్‌… మరి రాత్రి ?

May 29, 2020

రాజకీయ నాయ‌కుల్లో ఎమ్మెల్యే రోజా ప‌ని బాగుంది. సాధార‌ణంగా మ‌హిళ‌లు ఇంటి ప‌ని కాకుండా ఇంకో ప‌ని చేస్తేనే వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి బోలెడు ప్ర‌శ్న‌లు అడుగుతున్నారు. కానీ రోజా మాత్రం మూడు పాత్ర‌లు సక్సెస్‌ఫుల్‌గా పోషిస్తోంది. ప‌గ‌టి పూట రాజ‌కీయాలు చేస్తూ న్యూస్ ఛానెల్స్ లో క‌నిపిస్తుంది. రాత్రిపూట కామెడీలు, క్రైమ్ సీన్‌లు చూపిస్తూ ఎంట‌ర్ రైట‌న్‌మెంట్ షోల‌లో క‌నిపిస్తోంది. ఈ రెండింటితో పాటు ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది.ఇదంతా ఇపుడు ఎందుకు చెబుతున్నామ‌నుకుంటున్నారా?

ఇప్ప‌టికే నాలుగైదు షోల‌తో బిజీగా ఉన్న రోజా ఇక‌నుంచి ప్ర‌తిరోజు రాత్రి 10 గంట‌ల‌కు జెమినీ టీవీలో క‌నిపించబోతోంది. తాజాగా స్టార్ట్ అయిన త‌స్మాత్ జాగ్ర‌త్త అనే డైలీ క్రైమ్ షోకి ఆమె వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హరిస్తున్నారు. అస‌లే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న టైంలో ఇన్ని టీవీ షోలు చేస్తుందంటే… ఎల‌క్ష‌న్ ఖ‌ర్చుల కోసం అన్నీ ఒప్పేసుకుందా? లేక రేపు ఎలాగూ జ‌గ‌న్ గెలిచేదీ లేదు.. తాను మంత్రి అయ్యేదీ లేదు… ఉన్న ఎమ్మెల్యే పోస్టు కూడా ఊడిపోతే ఖాళీగా ఉండ‌కుండా ఇవ‌న్నీ ఉంటాయ‌ని ఒప్పుకుందా అన్న‌ది కొంచెం తీరిగ్గా థింక్ చేయాల్సిన విష‌య‌మే.