బాబు తెచ్చాడు... రోజా పూజ చేసింది

February 27, 2020

చంద్రబాబు హయాంలో ఏపీకి తరలివచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటి టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ. వేల ఉద్యోగాలు సృష్టించగలిగిన ఈ కంపెనీ వల్ల తిరుపతి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీలు వచ్చిన తిరుపతికి టీసీఎల్ మరో మణిహారం అయ్యింది.

తాజాగా ఆ కంపెనీ ఏర్పాట్లు నిధులు సిద్ధం చేసుకుని ఈరోజు భూమి పూజ చేసుకుంది. దీనికి ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ముఖ్యఅతిథిగా హాజరై కంపెనీకి భూమి పూజ నిర్వహించారు. తన చేతుల మీదుగా ఓ పెద్ద కంపెనీకి తొలిసారి భూమి పూజ చేస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ ఆమె హర్షం వ్యక్తంచేశారు. కంపెనీలకు మా ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని రోజా అన్నారు. 

టీసీఎల్ ఏపీలో పెట్టిన పెట్టుబడుల విలువ రూ.2,200 కోట్లు. మొత్తం రెండు కంపెనీలు ఏర్పాటు చేయనుంది.