రోజమ్మా... ఈ మాట మాట్లాడేటపుడు మీకేమనిపించలేదా ?

June 03, 2020

ఏపీలో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. కారణం కరోనా కాదు. అక్కడి ముఖ్యమంత్రి తీరు. దేశమంతటా బతికుంటే బలుసాకు తిందాం. ముందు కరోనా పోయేదాకా లాక్ డౌన్ పెట్టండి. లేకపోతే ఇబ్బందవుతుంది అని ముఖ్యమంత్రులు అందరూ కోరుతుంటే ఏపీ ముఖ్యమంత్రి తన ఇగో కోసం ఎన్నికలు జరిపి తీరాల్సిందే అని పట్టుబట్టి లాక్ డౌన్ వద్దు అంటున్నారు. అంతేకాదు... దేశం మొత్తం మీద వైద్యులకు కనీస భద్రత సదుపాయాలు కల్పించని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. పీపీఈల సంగతి తర్వాత అసలు డాక్కర్లకు మాస్కులే ఇవ్వలేదు. కానీ రాజకీయ నాయకులకు ఆ మాస్కులు తరలించారు. ఏపీలో వైకాపా నాయకులందరూ N95 మాస్కులు ధరిస్తున్నారు. కానీ ఏపీలో డాక్టర్లు ఎవరికీ ఇవి దొరకడం లేదు. చివరకు మాస్కు అడిగిన వారిని సస్పెండ్ చేస్తున్నారు. చివరకు చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ ని కూడా మాస్కులు పంపలేదు అన్నందుకు సస్పెండ్ చేశారు. ఇది రోజా సొంత నియోకవర్గం. 

ఈరోజు రోజా ఏమందో తెలుసా... ఏపీ ముఖ్యమంత్రి జగన్ దేశానికే ఆదర్శం... ప్రతి వ్యక్తికి మూడు మాస్కులు పంచమని ఆదేశాలు జారీ చేశారు అంటూ పొగిడింది. ఆమె కళ్ల ముందే నగరి మున్సిపల్ సిబ్బంది మాస్కులు లేక కర్చీఫ్ లు కట్టుకుని తిరుగుతున్నారు. ఆమె స్వయంగా చూసి కూడా ఆత్మసాక్షికి విరుద్ధంగా జగన్ దేశానికే ఆదర్శం అంటూ పొగిడింది.

ఆమె తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ 'రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5.3 కోట్ల మంది ప్రజలకు మొత్తం కలిపి 16 కోట్ల మాస్కుల పంపిణీకి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు మూడు మాస్కుల చొప్పున అందుకుంటారు' అని అన్నారు. ‘‘జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కొనియాడుతున్నారు’’ అని ఆమె చెప్పారు. 

అసలు 20 రోజుల కిందట లాక్ డౌన్ పెడితే... ఇంత ఆలస్యంగా మాస్కులు పంచాలని ఆలోచన వచ్చినందుకు అభినందించాలా, అంతా మునిగిపోయాక నివారణ చేయమని చెప్పిందుకు అభినందించాలా రోజా గారు? ఇదే కనుక మార్చి 22న లేదా 25న జగన్ ఇలాంటి ఆదేశాలు చేసి ఉంటే.. కచ్చితంగాఏపీ ప్రజలు అభినందించేవారు. ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకోవడం, చట్టాలు చేయడం కాదు... ఆ ఫలాలు ప్రజలకు చేరినపుడే అవి నెరేరినట్టు లెక్క. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న వెంటనే వీరుడు శూరుడు అని పొగిడే ఈ రోజా గారు తమ సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలిసినా ఎందుకు జగన్ ను ప్రశ్నించలేదు. ప్రశ్నించకపోతే పోయారు... కనీసం మాస్కులు తక్షణావసరం. మరి ఎప్పటి లోపు మాస్కులు అందుతాయో అన్ని కోట్ల మాస్కులు ఎపుడు తయారుచేస్తారో తెలియని పరిస్థితి. వీళ్లు ఇంటింటికీ మాస్కులు అందేనాటికి దేశంలో కరోనా కూడా ఉండదేమో.

ఇంకో విషయం ఏంటంటే... ఈ మాస్కుల టెండరు ఎంత? అది ఎవరికి ఇచ్చారు? టెండరులో ఒక్కో మాస్కు తయారీకి ఎంత కేటాయించారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు బయటపెడితే అపుడు ఈ పని ముఖ్యమంత్రి ప్రజల కోసం చేశారా? తన కోసం చేశారా ? అనే విషయం తేలిపోతుంది. 

 

తమాషా ఏంటంటే... లాక్ డౌన్ వల్ల అదుపులో ఉన్న కరోనాను తమ పబ్లిసిటీ పిచ్చితో ప్రజలతో సమావేశాలు గుంపులుగుంపులుగా పెట్టి, ర్యాలీలు తీసి కరోనా వ్యాప్తికి అవకాశాలు కల్పించారు. ఇలాంటి వారు ప్రజల ప్రాణాలు కాపాడేలా మాస్కులు పంచుతారు అంటే నమ్మడానికి ఇదే 2019 ఏప్రిల్ 11 కాదు రోజాగారు... చదువులేనోడికైనా ఇంత కాలం పాలన ఎలా ఉందో అర్థం కాదా? మీరు కూడా కాస్త ఆత్మ సాక్షిని అనుసరించి మాట్లాడండి. అన్ని రోజులు మంచివి కాకపోవచ్చు.