రోజాను మళ్లీ ఏడిపించిన పవన్

July 05, 2020

గతంలో 2014 ఎన్నికల ఫలితాలు వచ్చినపుడు జరిగిన సంఘటన గుర్తుందా మీకు?

పవన్ వల్ల మాకు అధికారం దూరమయ్యిందని రోజా కన్నీరు పెట్టుకుని ఏడ్చింది. అయితే... తాజాగా ఒక్కసీటు కూడా లేని రెండు పార్టీలు (రాపాక ఉన్నా ఊడినట్టేలే) పొత్తు పెట్టుకుంటే వైసీపీ మొత్తానికి దు:ఖం ఆగడం లేదు. ఆ పొత్తు వల్ల ఫలితాలు తారుమారవుతాయని కాదు వారి బాధ... తలరాతలు తారుమారవుతాయని. బీజేపీతో ఏదో పొర్లుదండాలు పెట్టి నెట్టుకువస్తున్న తమ జీవితం పవన్ వారి పక్కన చేరితే మా పరిస్థితి ఏంటి అని వైసీపీ వర్గం దు:ఖపడుతోంది. 

లేకపోతే... పవన్, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే... స్పందించాల్సిన అవసరం ఇతర పార్టీలకు లేదు కదా. అది వారి రాజకీయ నిర్ణయం. రెండూ కనీసం ప్రతిపక్షాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో పవన్ పొత్తు గురించి మాట్లాడుతూ రోజా చేసిన ఒక వ్యాఖ్య వింటే... వైకాపా కు బీజేపీ అంటే ఎంత భయమో ఇట్టే అర్థమవుతుంది. బీజేపీ పెద్దలు ఎందుకు ఇలాంటి వారిని తమ పార్టీలో చేర్చుకుంటున్నారో అర్థం కావడం లేదు. పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవడం కుక్క తోక పట్టుకొని గోదావరిని ఈదడం లాంటిదే. ఈ మాటలో ఎంత ఆవేదన ఉందో చెప్పనక్కర్లేదు. మాతో సఖ్యంగా ఉంటున్న బీజేపీని వేరు చేస్తావా పవన్ అన్న బాధ కట్టలు తెంచుకుంది రోజాకు. కాకపోతే మునుపటిలాగా ఏడవలేదు అంతే. 

అయితే వామ పక్షాలకు మాత్రం పవన్ ని తిట్టే హక్కుంది. ఎందుంటే ముందు నుంచి వామపక్ష భావాలు ప్రదర్శించి, ఎర్ర తువాలు వేసుకుని తిరిగిన పవన్ ఏకంగా కాషాయంతో పుసుక్కున స్నేహం చేయడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి ఆవేదనలో మాత్రం నిజముందని చెప్పకతప్పదు. కానీ ఒక రాజకీయనాయకుడిగా పవన్ సందర్భానుసారం తన సేఫ్టీ తాను చూసుకున్నాడు.