రోజా రెడ్డి గెలిచింది... డిప్యూటీ సీఎం ???

August 14, 2020

అవును... నిన్నటి నుంచి పార్టీలోని చిత్తూరు జిల్లాలో రోజా రచ్చరచ్చ చేస్తున్నారు. తన పర్మిషను లేకుండా, తన నియోజకవర్గం నగరిలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కార్యక్రమం ఏర్పాటుచేయడంపై ఎమ్మెల్యే రోజా తీవ్రంగా ఆగ్రహించారు. డిప్యూటీ సీఎం అని చూడకుండా అతనిపై అనేక విమర్శలు చేశారు. తనను పిలవకుండా నా నియోజకవర్గంలో కార్యక్రమం పెడతారా అంటూ ఎగిరారు. దీంతో ఈ పంచాయతీ సీఎం వద్దకు వెళ్లింది. సహజంగానే అక్కడ రోజా గెలిచింది.

రోజా ది జగన్ సామాజిక వర్గం. డిప్యూటీ సీఎం నారాయణస్వామిది వేరే సామాజిక వర్గం. ఇద్దరికి డిస్పూట్ వచ్చినపుడు కచ్చితంగా పార్టీ అధిష్టానం ఏం తీర్పు ఇస్తుందో మనం అంచనా వేయవచ్చు. ఆ ధైర్యం తోనే డిప్యూటీ సీఎం అని కూడా చూడకుండా రోజారెడ్డి నారాయణ స్వామి మీద ఎగిరి పడ్డారు. చివరకు పంచాయతీలో డిప్యూటీ సీఎం వెనక్కు తగ్గారు. సారీ చెప్పారు. ఆమె నా సిస్టర్ అన్నారు. ఇంకేముంది సమాప్తం.

పార్టీలో జగన్ పంపించే సంకేతాలు ఇలాగే ఉంటాయి. ఎవరి తన సామాజిక వర్గం జోలికి వస్తే జగన్ సహించరు. ఆ విషయంలో నోరు జారే ముందు ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే మరి.