వాటన్నిటినీ బ్యాన్ చేసిన రాజమౌళి...

June 01, 2020

జనాలకు ఏది వద్దంటే అది చేయడం అలవాటు. భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న #RRR సినిమా కోసం రాజమౌళి పడుతున్న కష్టాన్ని కొందరు పలుచన చేస్తున్నారు. ఆ సినిమా గురించి రాజమౌళి ఎంత సీక్రెట్ గా మెయింటెయిన్ చేస్తున్నా...లీకులు వేధిస్తున్నాయి. తాజాగా ఈరోజు బయటకు వచ్చిన ఓ స్టిల్ రాజమౌళికి బీపీ తెప్పించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తున్నాడు. సినిమా విడుదల వరకు ఈ వివరాలు బయటపెట్టకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నాడు.

అందుకే షూటింగ్ లొకేషన్లోకి యూనిట్ అనుమతి లేకుండా ఎవ్వరూ ఏ ఎలక్ట్రానిక్ వస్తువును గాని, కెమెరా ఫోను గాని తేవడానికి వీల్లేదని నిబంధన పెట్టాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక చిన్న లొకేషన్ వీడియో బయటకు వచ్చింది. కొమరం భీం వేషంలో ఎన్టీఆర్ గిరిజన గూడెంలో మాట్లాడుతున్న వీడియో తెగ వైరల్ అయ్యింది. ఇన్ని కఠిన నిబంధనలు పెట్టినా ఇది ఎలా లీకైందబ్బా అని తలపట్టుకుందట చిత్ర యూనిట్. అయితే... ఈ లీకుల పిచ్చితో మూడ్ పాడు చేస్తున్నారని రాజమౌళి హర్ట్ అయ్యారట.