`మాహిష్మ‌తి` ప్ర‌జ‌ల కోరిక జ‌క్క‌న్న తీరుస్తాడా?

August 08, 2020

`బాహుబ‌లి`తో తెలుగు సినిమా స్టామినాను ప్ర‌పంచ‌దేశాల‌కు చాటి చెప్పిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. అప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్ అంటే చిన్న చూపున్న బాలీవుడ్ కు తెలుగోడి స‌త్తా చూపించాడు జ‌క్క‌న్న‌. దీంతో, రాజ‌మౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ `ఆర్ఆర్ఆర్` పై భారీ అంచ‌నాలున్నాయి. టాలీవుడ్‌లోని ఇద్ద‌రు స్టార్ హీరోలు న‌టిస్తోన్న ఈ భారీ మ‌ల్టీ స్టార‌ర్ కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే, ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం నుంచి క‌నీసం ఫ‌స్ట్ లుక్ కూడా రాలేదు. ఇదే విష‌యంపై `ఆర్ఆర్ఆర్` టీమ్‌కు, `బాహుబ‌లి`టీమ్‌కు మ‌ధ్య సోష‌ల్ మీడియాలో స్వీట్ ట్వీట్ వార్ న‌డుస్తోంది.
`ఆర్ఆర్ఆర్` అప్డేట్స్, ఫస్ట్ లుక్ కోసం సినీ అభిమానులు ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో ఓ ఫ్యాన్ పెట్టిన కామెంట్ వైర‌ల్ అయింది. తాను 'మాహిష్మతి' సామ్రాజ్యానికి చెందిన వ్యక్తినని, ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్నానని ఓ ఫ్యాన్ ట్వీట్ చేశాడు. అయితే, ఆ ట్వీట్‌కు 'బాహుబలి' టీమ్ స్పందించింది. `ఆర్ఆర్ఆర్` ఫస్ట్ లుక్ కోసం త‌మ మాహిష్మతి ప్రజలు ఎదురు చూస్తున్నార‌ని, రాజమౌళి సర్ అప్ డేట్ ఇవ్వాలంటూ బాహుబలి టీమ్ ట్వీట్ చేసింది.ఈ ట్వీట్‌కు `ఆర్ఆర్ఆర్` టీమ్ స్పందించింఇ. మాహిష్మ‌తి అడుగు జాడల్లోనే తామూ నడుస్తున్నామని కౌంట‌ర్ పంచ్ వేసింది. 'బాాహుబలి'  పోస్టర్లు, ట్రయిలర్ కోసం ఫ్యాన్స్ ఎంత‌గా వెయిట్ చేశారో త‌మ‌కు గుర్తుంద‌ని ఫ‌న్నీగా ట్వీట్ చేసింది. ఈ స్వీట్ ట్వీట్ వార్ సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది.