RRR అదిరిపోయే అప్‌డేట్‌.... తార‌క్ ఫ్యాన్స్‌కు పూన‌కాలే

February 25, 2020

తెలుగు సినిమా ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ సినిమా ఆర్ ఆర్ ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో రూ.250 కోట్ల‌ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. వేర్వేరు కాలాల‌కు చెందిన ఈ ఇద్ద‌రు పోరాట యోధులు క‌లిసి ఒకేసారి స్వాతంత్య్ర పోరాటం చేస్తే ఎలా ఉంటుంద‌న్న క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ప్రస్తుతం సినిమా షూటింగ్ యూర‌ప్‌లోని బల్గెరియాలో జరుగుతుంది. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రకు సంబంధించిన సన్నివేశాలను ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి షూట్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ జ‌ర‌గాల్సి ఉండ‌గా... రామ్‌చ‌ర‌ణ్ ఇప్ప‌టికే రెండుసార్లు గాయానికి గుర‌వ్వ‌డంతో షూటింగ్ లేట్ అయ్యింది. మ‌రో నెల రోజుల పాటు అక్క‌డే కొన్ని సీన్లు షూట్ చేస్తారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఏ అప్‌డేట్ వ‌చ్చినా మెగా, నంద‌మూరి అభిమానుల‌కే కాకుండా ప్ర‌తి ఇండియ‌న్ సినిమా అభిమానికి పెద్ద సెన్షేష‌న‌ల్ న్యూస్ అవుతోంది.

తార‌క్ ఫ్యాన్స్ అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమాలో కొమ‌రం భీంగా న‌టిస్తోన్న తార‌క్ లుక్‌ను అక్టోబ‌ర్‌లో కొమరం భీం జయంతి ( అక్టోబర్ 22) సందర్భంగా ఫస్ట్ లుక్ సింగిల్ డైలాగ్‌తో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను రాజ‌మౌళి తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ, మ‌ళ‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఈ సింగిల్ డైలాగ్ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ డైలాగును నాలుగు భాష‌ల్లోనూ ఎన్టీఆర్‌తోనే చెప్పిస్తున్నార‌ట‌. ఎన్టీఆర్‌కు తెలుగు, త‌మిళ్‌, కన్నడ మాత్రం బాగా వచ్చు. క‌న్న‌డ భాష‌లో గ‌తంలో పునీత్ రాజ్‌కుమార్ కోసం గెల‌యా... గెలుపే నీద‌యా అన్న సాంగ్ పాడిన సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా ఎన్టీఆర్ లుక్ రిలీజ్ అయితే సినిమాపై హైప్ మామూలుగా ఉండ‌దు.