రాజమౌళి RRR... ప్రెస్‌మీట్ సంగ‌తులివే

May 29, 2020

రామారావు, రామ్ చరణ్ క‌థానాయ‌కులుగా నిర్మిస్తున్న సినిమా టైటిల్ ను.. 'RRR గా నే ఉంచుతామ‌ని రాజ‌మౌళి ప్ర‌క‌టించారు. ఈ సినిమాను 2020 జూలై 30న విడుదల చేస్తార‌ట‌. భార‌త దేశ చ‌రిత్రో భారీ బడ్జెట్ సినిమాల్లో ఇదొక‌టి. ఈ సినిమా బ‌డ్జెట్‌ రూ.350-400 కోట్లు.
1897లో పుట్టిన అల్లూరి సీతారామరాజు కొన్నేళ్ళు దేశాటనకు వెళ్లారు. ఆ తరువాత బాగ చదువుకొని వచ్చి... స్వతంత్రం కోసం పోరాడు.... అలాంటి యంగ్ సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు... అతనికి జంటగా అలియా భట్ నటిస్తోంది. సీతారామరాజు పుట్టిన నాలుగేళ్లకు1901లో కొమరం భీమ్ ఉత్తర తెలంగాణాలో జన్మించారు. అతను కూడా కొన్నేళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లి... బాగ చదువుకొని వచ్చి... నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడాడు... అలాంటి యంగ్ కొమరం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు... అతనికి జంటగా డైసీ ఎడ్గగర్ జోన్స్ ఫారిన్ అమ్మాయి నటిస్తున్నారు.
ఇది కంప్లీట్ ఫిక్షన్ స్టోరీ... 1920లో నార్త్ ఇండియాలో జరిగే కథ ఇది. అజయ్ దేవగన్.. ఓ స్ట్రాంగ్ రోల్ ఫ్లాష్ బ్యాక్ లో నటిస్తున్నారు. సముద్ర ఖని... ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

నేను ఇంకా రియాలిటీలోనూ ఇది నిజమా కాదా అని అనిపిస్తుంది. ఎప్పటి నుండో రాజమౌళితో పనిచేయాలని ఉంది. అయితే నాకు బాగా నచ్చే ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. రాజమౌళి ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఆయన ఇంటికి వెళ్లాను. వెళ్లగానే జూనియర్ ఎన్టీఆర్ కనిపించారు. అదేంటి ఈయన ఉన్నారు ఏంటి అనుకున్నాను. ఇద్దరం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. కొంచెం సేపయ్యాక మా ఇద్దర్నీ లోపలికి తీసుకువెళ్లి రాజ‌మౌళి ఈ కథను చెప్పారు. ఖచ్చితంగా మీతో సినిమా చేస్తున్నాం అని ఆయనతో చెప్పాం. ఆ ఆనందంలో తీసిన ఫొటోనే అప్పట్లో మీతో షేర్ చేసుకున్నాం.
- రామ్‌చ‌ర‌ణ్‌

నేను ప్రెస్ మీట్ అంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాను. కాని ఈసారి ఎందుకో కాస్త టెన్షన్‌గా ఉంది. ఏదో ఒక‌ర‌క‌మైన తాదాత్మ్యం. జక్కన్నతో ఇది నాలుగో చిత్రం. వాట‌న్నింటికంటే ఇది చాలా స్పెషల్ గా మిగిలిపోతుంది. రామ్‌కు నాకు ముందు నుంచి స్నేహం ఉంది. అదిలా సినిమాలో కూడా క‌లిసి సాగుతుంద‌ని అనుకోలేదు. దిష్టి తగిలే స్థాయిలో మా బంధం బలపడింది.
- జూనియ‌ర్ ఎన్టీఆర్‌