రాజు గారి వేగానికి, వ్యూహానికి చితికిపోతున్న వైకాపా

August 07, 2020

నరసాపురం ఎంపీ రఘురామరాజు వేస్తున్న సంచలన అడుగులు, వ్యవహార శైలి వైకాపా పార్టీకి చలిజ్వరం తెప్పిస్తున్నాయి. రాజు గారి చర్యలతో ఇప్పటికే పార్టీ నాయకులు తలపట్టుకుంటున్నారు. చాలామంది పార్టీ నాయకులకు తాజాగా అర్థమైన విషయం ఏంటంటే... ఆయనతో పెట్టుకునే మన రేంజ్ కాదని... సైలెంటైపోతున్నారు.

సాధారణంగా జగన్ మోహన్ రెడ్డిని ఎవరైనా ఏదైనా అంటే కార్యకర్తలు అస్సలు ఊరుకోరు. పచ్చిబూతులతో విరుచుకుపడతారు. రాజుగారు కూడా ఒక ఎంపీయే కదా తొలుత అలానే చేశారు. కానీ మెల్లగా రాజు రేంజ్ ఏంటో... వారికి అర్థమైపోయింది.

రాజు గారిని డీల్ చేయడానికి వైసీపీ పరివారం మొత్తానికి కూడా సాధ్యం కావడం లేదు. వారు ఊహించని రిప్లైలు వస్తున్నాయి రఘురామరాజు నంచి. పార్టీ నోటీసు ఇస్తే ఆయన ఏదో ఒక రిప్లై ఇస్తాడు, సస్పెండ్ చేసి ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెడదాం అనుకున్నారు. కానీ వారికి ఊహించని రిప్లై వచ్చింది. నేను ఎన్నికైన పార్టీ నుంచి నాకు నోటీసు రాలేదు కాబట్టి తనకు వచ్చిన ఏదో తెలియని పార్టీకి రిప్లై ఇచ్చారు. 

ఎవరయ్యా ఈయన రాష్ట్ర పార్టీకి జాతీయ అధ్యక్షుడు అంటున్నాడని సాయిరెడ్డిని ఒకాటడుకున్న రఘురామరాజు అసలు వీళ్లు నిబంధనలకు విరుద్ధంగా వేరే పార్టీ పేరు వాడుకుంటున్నారు అని ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశాడు. ఇపుడు వైకాపానే డైలమాలే పడేశాడు. వైఎస్సార్ కాంగ్రెస్ అని పిలవడానికి పర్మిషన్ లేదు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పిలవాల్సి, రాసుకోవాల్సిన పరిస్థితి తలెత్తేలా చేస్తున్నాడు. వైసీపీ చేస్తున్న తప్పులు ఒక్కోదాన్ని చీల్చి చెండాడుతున్నాడు.

తాజాగా మరో షాక్ ఇస్తూ.. స్వయంగా ఈసీ ఆఫీసుకు వెళ్లాడు. పార్టీ ఇలా మీరు చెప్పినా వినకుండా తప్పుడు పేరుతో నడుపుతున్నారని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లాడు. అనంతనరం తన నియోజకవర్గంలో అడ్డుకుంటున్న విషయాన్ని చెప్పడానికి లోక్ సభ స్పీకరు దగ్గరకు వెళ్లాడు. మళ్లీ ఇపుడు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. జగన్ కి అపాయింట్మెంట్ తిరస్కరించిన  కేంద్రమంత్రులు రాజుకి టకటకా అప్పాయింటెమెంట్ ఇచేస్తున్నారు. అతని వేగానికి వ్యూహానికి వైకాపా చితికిపోతోంది. 

ఇంతా చేస్తూ నాకు జగన్ అంటే ఇష్టం. ఆయన నన్ను పార్టీ నుంచి తీసేయరు. ఆయన తీసేస్తే ఫీలవుతాను. నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ లోనే ఉంటాను అని జగన్ ని పల్లెత్తు మాట అనకుండా ఆయన కోటరీతో చెడుగుడు ఆడుతున్నారు.