అభిమానులకు ఎన్టీఆర్ స్మాల్ గిఫ్ట్

May 31, 2020

సినిమా అనేది చాలామందికి వినోదం, అభిమానులకు పిచ్చి. తమ హీరోను ప్రతిసారి కొత్తగా తెరపై చూసి ఆనందించే సమూమే అభిమానులు. వారిని ఎప్పటికపుడు సంతృప్తి పరచడానికి కొందరు సెలబ్రిటీలు తాపత్రయ పడితే... మరికొందరు తమ అభిమాన నటీనటులు ఏమిచ్చినా సంబర పడతారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఇటీవలే వీరిద్దరితో పాటు మరో టాప్ స్టార్ అజయ్ దేవ్ గణ్ కూడా ఈ షూటింగ్ లోపాల్గొన్నారు. ఆయనది కూడా కీలక పాత్రే. షూటింగ్ సందర్భంగా దర్శకుడు ... ముగ్గురు ప్రధాన పాత్రధారులు దిగిన ఫొటోను ఎన్టీఆర్ షేర్ చేసుకున్నారు. దాన్ని చూసి అభిమాన గణం మురిసిపోయింది.