మోడీషాల... ఓపికను పరీక్షిస్తున్న జగన్, తాజా గొడవతో జగన్ అవుటే

August 07, 2020

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి గ‌త కొద్దికాలంగా ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ల‌డ్డూల అమ్మ‌కం విష‌యంలో మునుప‌టి కంటే విభిన్న రీతిలో అందుబాటులోకి తేవాల‌నే ఆదేశాలు వెలువ‌రించింది. దీనిపై భిన్నాభిప్రాయ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. 

తాజాగా టీటీడీ బోర్డు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భూముల‌ అమ్మ‌కానికి సిద్ధ‌మైంది. ఇందు కోసం ఎనిమిది మంది అధికారుల‌తో రెండు కమిటీల‌ను నియ‌మించింది. వాటి రిజిస్ట్రేష‌న్ బాధ్య‌త‌ల‌ను కూడా వారికే అప్ప‌గించింది.

బాబు మీద కోపంతో, స్టేట్ క్యాడర్ పెట్టిన ఫిటింగులతో చంద్రబాబును దూరం చేసుకుని జగన్ కు చేయిందిస్తే... జగన్ పొలిటికల్ గా సైలెంటుగా ఉన్నా... బీజేపీ సిద్ధాంతాలకు, ఆర్ఎస్ఎస్ మూలాలకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. టీటీడీ విషయంలో కచ్చితంగా జగన్ తాజా నిర్ణయం మోడీషాలకే కాదు, ఆర్ఎస్ఎస్ కి కోపం నషాళానికి ఎక్కేలా చేసిందని చెబుతున్నారు.

 

జగన్ అమ్ముతున్న భూములెక్కడివి?


త‌మిళ‌నాడులోని వేర్వేరు జిల్లాల్లో శ్రీవారి పేరుతో భూములు ఉన్నాయి. తిరువ‌ణ్ణామ‌లై, తిరుచిరాప‌ల్లి, తిరుచ్చి, తిరువ‌ళ్లూర్, ధ‌ర్మ‌పురి, విల్లుపురం, కంచి, కోయంబ‌త్తూర్, వెలూర్, నాగ‌ప‌ట్నం జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ భూములు ఉన్నాయి. అయితే, నిర‌ర్ధ‌కంగా ప‌డి ఉన్నాయ‌న్న పేరుతో 23 ప్రాంతాల్లో ఉన్న వ్య‌వ‌సాయ భూములు, ప్లాట్లను అమ్మేందుకు టీటీడీ బోర్డు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఆయా ఆస్తుల‌ను బ‌హిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశిస్తూ ఎనిమిది మంది అధికారుల‌తో రెండు కమిటీల‌ను నియ‌మించింది. వాటి రిజిస్ట్రేష‌న్ బాధ్య‌త‌ల‌ను కూడా వారికే అప్ప‌గించింది. కాగా, వేలానికి సంబంధించిన టీటీడీ నిర్ణ‌యించిన క‌నీస ధ‌ర ప్ర‌కారమే ఆ భూములు దాదాపు రూ.కోటిన్న‌ర పైగా విలువ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

గ‌తంలో టీటీడీ బోర్డు చేసిన తీర్మానానికి అనుగుణంగా త‌మిళ‌నాడులోని వేర్వేరు జిల్లాల్లో ఉన్న శ్రీవారి భూముల‌ను అమ్మ‌కానికి సిద్ధ‌మైన‌ప్ప‌టికీ, శ్రీవారి ఆస్తులను విక్రయించడానికి టీటీడీ సిద్ధం కావడంతో రాజ‌కీయ పార్టీలు, వివిధ సంస్థ‌ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారి ఆస్తులను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాయి.

ఇదిలాఉండ‌గా, క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా శ్రీవారి ద‌ర్శ‌న భాగ్యం లేకున్నా భ‌క్తులు ఏప్రిల్ నెల‌లో ఆన్ లైన్ ఈ-హుండీ ద్వారా దాదాపు రూ.2 కోట్ల‌ కానుక‌లు అంద‌జేశారు.  2019 ఏప్రిల్ నెల‌లో ఈ-హుండీ ద్వారా రూ.1.79 కోట్లు రాగా.. ఈ ఏడాది ఏప్రిల్ లో రూ.1.97 కోట్లు వ‌చ్చాయి. ఈ ఏడాది అద‌నంగా రూ.18 ల‌క్ష‌లు పెరిగిన‌ట్లు చెప్పారు. లాక్ డౌన్ కారణంగా నేరుగా శ్రీవారి దర్శనానికి రాలేకపోయినా.. ఈ-హుండీ ద్వారా కానుకలు భక్తులు కానుక‌లు స‌మ‌ర్పించారు.