ఆర్టీసీ కార్మికుడి వైపు నిలిచిందే అసలైన మీడియా-రవిప్రకాశ్‌..!

July 13, 2020

మీడియా కబ్జాకోర్లు ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా వార్తలు రాయించడంలో బిజీగా ఉన్నారు. బానిసలుగా మారిన కొందరు పాత్రికేయులు యాబై వేలమంది కార్మికుల సమ్మె విఫలమైందనే కధనాలు ప్రచురిస్తూ, ప్రసారం చేస్తూ జమిందార్లకు సేవచేసి తరిస్తున్నారు.
ఈ రోజు ఆర్టీసీ కార్మికులు మెరుగైన సమాజం గురించి జీవితాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు. కేవలం లాభాలు వచ్చే రూట్లలో బస్సులు నడిపే ప్రైవేటు దొంగల చేతుల్లోకి ఆర్టీసీ పోతే గ్రామీణ ప్రాంతాలకు బస్సు వసతి లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడడం ఖాయం.

అసలు కథ గోల్డ్ స్టోన్ ప్రసాద్ తో మొదలైంది. అమెరికాలో రెండు బ్యాంకుల్నిముంచి హైదరాబాద్ వచ్చిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ నగరంలో 26 వేళా ఎకరాల భూమిని కబ్జా చేసాడన్నసంగతి తెలిసిందే. మరో పదివేల ఎకరాల ప్రభుత్వ భూమిని మియాపూర్ లో కబ్జాచేయబోయి దొరికిపోయాడన్న వార్త కూడా అందరికి తెలుసు. అమెరికా పోలీసులు వెతుకుతున్న ప్రసాద్ ఓ చైనా బస్సుల కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందంతో మేఘా కృష్ణారెడ్డిని కలిసాడు. 50 వేలమంది ఆర్టీసీ ఉద్యోగుల్ని తొలగిస్తే ఎంతో లాభం సంపాదించవచ్చని చెప్పాడు. దాంతో గోల్డ్ స్టోన్ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్ టెక్ గా పేరు మార్చుకుంది. హైదరాబాద్ ఆర్టీసీలోకి చైనా బస్సులు వచ్చాయి. ఆర్టీసీ మీద ప్రైవేట్ దండయాత్ర మొదలైంది.

ఈ రోజు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా… ఈ డబ్బు పిచ్చి కబ్జాకోరులకి అర్ధంకాదు. పేద రైతులు భూములు కబ్జా చేసి, మీడియాను చంపి, ప్రాజెక్టులు లూటీ చేసి, ఆర్టీసీని మింగి మీరు ప్రపంచ ధనికుల జాబితాలో స్థానం సంపాదిస్తారు.

ప్రజాస్వామ్యాన్ని ఇంతగా ధ్వంసం చేసి ధనస్వామ్యంగా మార్చిన వారికి ఆర్టీసీ కార్మికుల విజయమే గుణపాఠం కావలి. మీరు చేసే పోరాటం దేశద్రోహులకు వ్యతిరేకంగా చేసే పోరాటం.

ఆర్టీసీ సమ్మెకు మీడియా లెజెండ్ రవి ప్రకాష్ జైలు నుండే తన పూర్తి మద్దతును తెలిపారు. ఆత్మసాక్షి ఉన్న జర్నలిస్టులు ఆర్టీసీ కార్మికుడికి భుజం కలపి నిలబడమని సందేశం పంపించారు. మీడియా కబ్జాకోరుల… ఆర్టీసీ కబ్జా యత్నాలను తిప్పికొట్టామని చెప్పారు. జర్నలిస్ట్ సంఘాలు ఈ సమ్మెకు పూర్తి మద్దత్తు తెలియజేయాలని విజ్ఞప్తి చేసారు.

 

Read Also

MEIL అలజడి : సారుకు ఆట మొదలైనట్లే?
చిరంజీవి అవసరం లేని తాపత్రయం - జగన్ కోసం ఆరాటం
టీవీ9 లో విజయసాయిరెడ్డి స్లీపింగ్ పార్ట్ నర్ ?