జ‌గ‌న్ దూకుడుకు బ్రేకులు...ఇవాళే అస‌లు ట్విస్ట్‌

May 26, 2020

మూడు రాజధానుల ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ కొన‌సాగుతోంది. సీఆర్డీయే రద్దు, ఆంధ్రప్రదేశ్‌ పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లులకు అసెంబ్లీలో ఆమోదం పొందిన‌ప్ప‌టికీ...ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉన్న శాస‌న‌మండ‌లిలో షాకులు ఎదుర‌వుతున్నాయి. మండలిలో ఏం జరుగుతుందన్న దానిపై తొలి నుంచీ ఉత్కంఠ ఉండ‌గా...దాన్ని నిజం చేస్తూ,  నెలకొంది. రాజధాని మార్పు, సీఆర్డీయే రద్దుపై ప్రభుత్వ విధానాన్ని తిరస్కరిస్తున్నాం. ఈ అంశాలపై ప్రభుత్వ విధానం పట్ల అవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాం’’ అని మండలిలో తీర్మానాన్ని ఆమోదించారు. కాగా, నేడు బిల్లుల‌పై పూర్తి స్ప‌ష్ట‌త రానుంది.
తెలుగుదేశం స‌భ్యులు మెజార్టీగా ఉన్న మండ‌లిలో ప్రభుత్వ బిల్లులను ప్రవేశ పెట్ట‌డానికి అనేక ఇబ్బందులు వైసీపీ ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఆదిలోనే బ్రేకులు వేసేందుకు టీడీపీ స‌భ్యులు రూల్ 71 అస్త్రాన్ని ప్ర‌యోగించారు. ‘‘నిర్ణయాలు చేయడంలో శాసనమండలిని ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదు. మంత్రి మండలి నిబంధనలకు విరుద్ధంగా విధానాలు రూపొందిస్తోంది. దీనిపై మా అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు రూల్‌ 71కింద చర్చ జరపాలి’’ అని కోర‌గా దానికి చైర్మ‌న్ ఓకే చెప్పేశారు. ప్రభుత్వ బిల్లులపై ఆమోదం పొందడం సంగతి అటుంచితే... వాటి ప్రవేశానికి అనుమతి పొందేందుకే మంత్రులు, వైసీపీ వ్యూహకర్తలు విశ్వప్రయత్నాలు చేయాల్సి వచ్చింది.
అయితే, మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బుగ్గన ఈ బిల్లులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. దీనిపై కొద్దిసేపటికి రూల్‌ 71పై చర్చ మొదలై వాడివేడిగా కొనసాగింది. రాత్రి 10.10 గంటల సమయంలో ఈ తీర్మానాన్ని మండలి ఆమోదించింది. దీంతో వైసీపీకి ఊహించిన షాక్ త‌గ‌లినట్ల‌యింది. కాగా, బిల్లుల‌లో టీడీపీ పేర్కొన్న  సవరణలతో వచ్చిన బిల్లులను అసెంబ్లీ చర్చించి, తిరస్కరించి మళ్లీ మండలికి పంపాల్సి ఉంటుంది. రెండోసారి కూడా మండలి తిప్పి పంపితే ఇక దాని పాత్ర ముగిసినట్టేన‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.