సినిమా లైఫ్ గురించి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

May 27, 2020

డిసెంబరు 20వ తేదీ రూలర్... గా మన ముందుకు వస్తున్నారు నందమూరి బాలకృష్ణ. మనవడిని ఎత్తుకునే వయసులో కూడా కుర్రకారుతో పోటీపడుతూ సినిమాలు తీస్తున్నారు బాలకృష్ణ. తాజాగా రూలర్ ప్రి రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ సందర్భంగా సినిమాల గురించి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనేంటో కూడా గుట్టు విప్పేశారు. అది బాలయ్య మాటల్లో వింటే బాగుంటుంది. 

’’నాకు సినిమా అంటే ఇష్టం. సినిమాను ప్రేమించాలి. కానీ వెర్రి వ్యామోహం పనికిరాదు. నేను అందరితో పనిచేయలేను. చాలా తక్కువ మందితో మాత్రమే నాకు సెట్ అవుతుంది. కొందరితోనే ఇమడగలను. అభిమానులకు నచ్చేది ఇవ్వడమే నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తాను’’ అంటూ బాలకృష్ణ తన స్వగతాన్ని సినిమా స్వగతాన్ని సింపుల్ గా చెప్పేశారు. ఏపీ ఏర్పడ్డాక తన సినిమాల్లో ఎక్కువగా ఏపీలోనే ఈవెంట్లు చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమా కూడా అలాగే చేశారు. ఈరోజు వేడుకలో బాలయ్య సంస్కృత శ్లోకాలు, సమాసాలు, గ్రాంథిక డైలాగులతో అభిమానులను ఉర్రూతలూగించారు. 

రూలర్ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సి కళ్యాణ్ నిర్మాత. భూమిక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ప్రకాష్ రాజ్, జయసుధతో పాటు పలువురు ఇందులో నటిస్తున్నారు.