మందుబాబులు రూల్స్ పాటించకుంటే... ఏం చేస్తారంటే..

June 03, 2020

మందుబాబులకు విషమ పరీక్ష ఎదురుకానుంది. కరోనా పుణ్యమా అని విధించిన లాక్ డౌన్ తో మద్యం అమ్మకాల్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. చుక్కకు అలవాటు పడిన ప్రాణం.. వారాల తరబడి అందుబాటులోకి లేకుండా పోవటం పిచ్చెక్కిపోయిన పరిస్థితి. నిత్యవసర వస్తువుల జాబితాలోకి మద్యాన్ని తీసుకోవాల్సిందేనన్న డిమాండ్లు సోషల్ మీడియా సాక్షిగా చాలానే వినిపించాయి. ఇదిలా ఉంటే.. ఈ రోజు (సోమవారం) నుంచి ఏపీలో మద్యం అమ్మకాల్ని షురూ చేయాలని నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల్ని మొదలు పెడుతున్న ఘనత ఏపీ సొంతం చేసుకోనుంది. ఇదిలా ఉంటే.. మద్యం అమ్మకాలకు తాజాగా సరికొత్త గైడ్ లైన్స్ ను తీసుకొచ్చారు. ఈ రూల్స్ ను బ్రేక్ చేసిన పక్షంలో.. మద్యం అమ్మకాలు బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మద్యం అమ్మకాలు షురూ అవుతున్న వేళ.. ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల్ని మందుబాబులు ఎంతలా పాటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


ఇంతకీ వారికి విధించిన నియమావళి ఏమిటన్నది చూస్తే..
% మద్యం కొనటానికి వచ్చే వారు భౌతిక (సామాజిక) దూరాన్ని పక్కాగా పాటించాల్సిందే
% మద్యం దుకాణంలోకి కేవలం ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు
% మాస్క్ లేనిదే మద్యం దుకాణంలోకి అనుమతించరు
% మాస్క్ లేని పక్షంలో మద్యం క్యూ లైన్ లోకి కూడా రానివ్వరు
% మద్యం దుకాణాల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటే కొంతసేపు మూసివేస్తారు
% నిబంధనల్ని ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటారు
% మద్యం దుకాణాలే తప్పించి.. బార్ లను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు
% షాపుల వద్ద ఏర్పాటు చేసే సర్కాల్స్ లోనే నిలబడాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కుదరదు
% కంటైన్మెంట్ జోన్ బయట మాత్రమే మద్యం అమ్మకాలకు అనుమతిని ఇస్తారు.