రష్యా కొంటె నర్సు... ఎంత పనిచేసిందంటే...

August 04, 2020

రష్యాలో ఒక నర్సు చేసిన పని ప్రపంచ వ్యాప్తంగా అందరినీ విస్మయానికి గురిచేసింది. మాస్కోకు దక్షిణాన వంద మైళ్ళ దూరంలో ఉన్న తులా పట్టణంలో పనిచేసే ఒక నర్సు... కేవలం లో దుస్తులు మాత్రమే వేసుకుని, డ్రస్సేమీ ధరించకుండా పీపీఈ కిట్ వేసుకుని విధుల్లోకి వచ్చింది. యవ్వనంలో ఉండటం, లోదుస్తులు మాత్రమే వేసుకోవడంతో పేషెంట్లు కూడా లేచి చూశారావిడను. 

రోగులు కొందరు సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రి అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. విచారణలో భాగంగా ఆమె ఏం చెప్పిందో తెలుసా.... అయ్యో నేను చూసుకోలదండీ, పీపీఈ కిట్ ఇంత పారదర్శకంగా ఉంటుందనుకోలేదు. లోపల డ్రెస్సు కనడపదు అనుకున్నాను అంటూ అమాయకంగా చెప్పింది. మరీ డ్రెస్సు వేసుకునేటుడు చేతిని చూసుకుంటే అది ట్రాన్సపరెంట్ గా ఉన్న విషయం తెలిసిపోతుంది కదా. ఆమె అదేపనిగా కొంటె పని చేసిందని అందరికీ అర్థమైంది.  దీంతో ఆసుపత్రి నుండి సస్పెండ్ చేశారు.  

ఆమె పారదర్శక డ్రెస్సుపై నెటిజన్లు ఏమంటున్నారో కరోనా వార్డులో పనిచేయడానికి ఆసక్తి లేక... ఈ చిలిపి పని చేసింది. సస్పెండ్ అవడమే ఆ నర్సు కోరుకున్నది. ఆమె చెప్పిన సమాధానాన్ని బట్టి ఈ విషయం అర్థం చేసుకోవచ్చు అంటున్నారు.