రాంచరణ్ సినిమా సేఫ్

February 21, 2020

రంగ‌స్థ‌లం విడుదలకు ముందు కొంపదీసి ఇది అవార్డుల సినిమాగా మిగిలిపోతుందేమో అని ఎక్కడో ఒక అనుమానం కొందరికి కలిగింది. కానీ... విచిత్రమైన నేటివిటీతో సుక్కు - రాము కలిసి సృష్టించిన ఈ విలేజ్ మ్యాజిక్ ఓ రేంజ్ లో ఉంది. బాక్సాఫీసులో ఎన్నో సంచలనాలు నమోదు చేసింది ఆ సినిమా. హిట్ టాక్ వచ్చాక కూడా 100 కోట్ల షేర్ మాత్రమే ఊహిస్తే... అది ఏకంగా రూ.128 కోట్ల షేర్‌ సాధించి కొత్త రికార్డు సృష్టించింది. 50-100 రోజులు కాలాలు ఎపుడో పోయాయి. అలాంటిది ఈ సినిమా 50వ రోజు కూడా మంచి షేర్ సంపాదించింది.

నాన్ బాహుబలి రికార్డుల్లో తండ్రి సృష్టించిన రికార్డును కొడుకే తిరగరాశాడు. ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు చాలా దూరంలో ఆగిపోతే ... సాహో ఊపు చూసి ఆ రికార్డను సాహో చెరిపేస్తుందనుకున్నారు. కానీ నో !నాన్ బాహుబలి రికార్డులో అధిక షేరు రంగస్థలానిదే. ఇంకా చెక్కు చెదరలేదు. ఇప్పుడప్పుడే చెక్కుచెదరదు కూడా.  తెలుగులో మాత్రం కౌంట్ చేసుకుంటే సాహో షేర్ రూ.80 కోట్ల లోపే ఉంది. రంగ‌స్థ‌లం సింగిల్ లాంగ్వేజ్‌లో రూ.128 కోట్ల షేర్ సాధించ‌డం విశేషం. మళ్లీ రాంచరణ్ - ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మాత్రమే ఈ రికార్డు చెరపగలదని ఇండస్ట్రీ టాక్. అయితే, మళ్లీ తన తన రికార్డును దాటుతాడేమో అన్న భయం చరణ్ కి లేకపోలేదు. ఒకవేళ దాటినా దానిని కూడా రాజమౌళి సినిమాతో చ‌ర‌ణ్‌ దాటేస్తాడు.