సాహో టీజర్... రోమాలు నిక్కబొడుచుకున్నాయ్

September 17, 2019

ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' కోసం తెలుగు సినిమా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. ఈరోజు విడుదల అయిన టీజర్ ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతోంది. యాక్షన్ సన్నివేశాలకు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలు లెక్కలేనన్ని ఉంటాయని టీజర్ లో అర్థమైపోయింది. అణవుణవు భారీ తనం కనిపిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా ఆగస్టు 15న విడుదల అవుతుంది.