సాహో... గురించి సెన్సేషనల్ సీక్రెట్ టాక్

February 23, 2020

యావత్ సినీ పరిశ్రమతో పాటు.. ఇతర వుడ్ లు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సాహో. రూ.300 కోట్ల భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తి కావటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో కథ మీద కంటే కూడా భారీ యాక్షన్ సీన్లే మీదే ఎక్కువ ఆధారపడటాన్ని చూసి అవాక్కు అవుతున్నారు.
భారీ బడ్జెట్ సినిమాలకు హంగు.. ఆర్బాటాలు మామూలే. వీటన్నింటికి మించి చక్కటి కథ చాలా అవసరం. కానీ.. సాహోలో కథ కంటే కూడా కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలే ఎక్కువన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఈ సినిమాను యాక్షన్ సన్నివేశాలే గట్టెక్కించాలన్న మాట ఇప్పుడో వినిపిస్తోంది. భారీ ఖర్చుతో ఏళ్లుగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి కొన్ని నెగిటివ్ టాక్స్ చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్నాయి.
అయితే.. ఇదంతా సాహోకున్న బజ్ ను దెబ్బ తీయటానికే అన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సాహోలో యాక్షన్ సీన్లు తప్పించి కథ పెద్దగా ఉండదని చెబుతున్నారు. అయితే.. యాక్షన్ సన్నివేశాలతోనే హిట్ అయిన సినిమాలు లేకపోలేదంటున్నారు.
భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించేటప్పుడు.. కథ విషయంలో కసరత్తు జరగకుండా రిస్క్ తీసుకోరన్న మాట వినిపిస్తోంది. సాహో అంటే మొదట్నించి గిట్టని వర్గం ఒకటి టైం చూసుకొని నెగిటివ్ ప్రచారం మొదలెడుతుందని.. రిలీజ్ కు ఐదారు రోజులు ముందు ఈ ప్రచారం మరింత ముమ్మరం అవుతుందంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొనటం.. ఈ సినిమా కానీ భారీ సక్సెస్ అయితే బాలీవుడ్ ను టాలీవుడ్ అధిగమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ.. వాదనల నేపథ్యంలో సాహోను యాక్షన్ సీన్ల ప్యాక్ గా రూపొందించారా? లేక.. కథకు అనుగుణంగా కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో సినిమాను రూపొందించారా? అన్నది తేలాలంటే ఆగస్టు 30 వరకూ వెయిట్ చేయాల్సిందే.