సాహో నుంచి మరో మెరుపు !

July 06, 2020

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో భారీ యాక్షన్ చిత్రం 'సాహో' రెడీ అయిపోయింది. బాహుబలి తర్వాత ఆ స్థాయి చిత్రం చేయాలనుకుని పట్టుదలకు పోయిన ప్రభాస్ మొత్తానికి అనుకున్నట్లే పెద్ద ప్రాజెక్టు చేశారు. మరి ఫలితం ఎలా ఉంటుందో ఇప్పటికైతే దేవుడికే తెలుసు.
భారీ పెట్టుబడి, విదేశీ టెక్నీషియన్స్, బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ మొత్తానికి ఈ సినిమాకు బాలీవుడ్లో ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. హిట్ అయితే, ప్రభాస్ ఇక బాలీవుడ్ కథానాయకుడిగా స్థిరపడిపోవచ్చు. కానీ... తేడా రాకుండా ఎంత జాగ్రత్త పడ్డారో వారికే తెలియాలి.
ఇటీవలే విడుదల అయిన ఈ టీజర్ బాగాఆకట్టుకుంది. తాజాగా ఒక కొత్త పోస్టరు వదిలారు. ఇది యాక్షన్ సీన్ పోస్టర్. గ్లాస్ డోర్స్ కి అవతల విలన్ గ్యాంగ్ .. ఇవతల హీరో హీరోయిన్లు గన్స్ తో కాల్పులు జరుపుతోన్న సీన్... !

ముందు ఆగస్టు 15న విడుదల చేద్దాం అనుకున్నా కూడా 30వ తేదీకి వాయిదా పడింది. ఫ్యాన్స్ కౌంట్ డౌన్ లెక్కేసుకుంటున్నారు. ఇంకో పోస్ట్ పోన్ అవకుండా సినిమా రిలీజ్ కావాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశ.