ప్రి ప్లాన్డ్ :: సబ్బంహరి వేసిన షాకింగ్ ప్రశ్నలు..

May 25, 2020

తనకు అనిపించింది, కనిపించింది... నిర్మొహమాటంగా చెప్పే నేతల్లో ఉత్తరాంధ్ర  నేత సబ్బంహరి ఒకరు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో పనిచేసిన ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా వైజాగ్ పర్యటనలో చంద్రబాబును అడ్డుకున్న తీరుపై విస్మయం వ్యక్తంచేసిన ఆయన ... ఇలాంటి ఘటన ఇన్నేళ్ల రాజకీయంలో ఎన్నడూ చూడలేదన్నారు. పోలీసులు అధికార పక్ష మాట వినడం సాధారణమే గానీ రౌడీల మాదిరి, మరీ ఇలా హద్దులు మీరి వ్యహరించడం మాత్రం అరుదైన విషయం అన్నారు. ఇంతకుముందు ఎన్నడూ చూడలేదన్నారు. 

ఆయన ఈ సందర్భంగా వైసీపీకి, పోలీసులకు కొన్ని ప్రశ్నలు వేశారు...

  • అంతమంది పోలీసులు ఉంటే... వైసీపీ కార్యకర్తలు బాబు కారు ముందు వచ్చి ఎలా పడుకోగలిగారు. 40 నిమిషాలు వాళ్లను పోలీసులు ఎందుకు కదిలించలేకపోయారు.
  • అసలు పోెలీసులు నేమ్ ప్లేట్లు పెట్టుకోకపోవడం చట్టవిరుద్ధం. అలా ఎందుకు జరిగింది?
  • బాబును అడ్డుకున్న వారికి బిర్యానీలు, డబ్బులు ఇచ్చింది నిజం కాదా? (తన వద్ద ఆధారాలున్నాయని సబ్బం చెప్పారు)
  • వైకాపా వారిని అడ్డుకోలేని పోలీసులు అనుమతి ఎందుకు ఇచ్చారు?
  • పోలీసుల రూపంలో బయటి వారు ప్రవేశించింది నిజం కాదా?
  • 2017లో జగన్ ని ఇలా అడ్డుకున్నారు అంటున్నారు. కానీ అపుడు జగన్ కి పోలీసులు అనుమతి ఇవ్వని విషయం ఎందుకు చెప్పడం లేదు?
  • అమరావతిలో రైతులు అడ్డమొస్తే కేసులుపెట్టారు. ఇపుడు ఎవరో అడ్డమొస్తే కేసులు పెట్టలేదు. అంటే ఇది కుట్రే కదా?