వాళ్లకి విచక్షణ లేదు, లోకేష్ నా బ్రదర్,

July 12, 2020

తెలుగుదేశం అధికార ప్రతినిధి సాధినేని యామిని లోకేష్ తన సోదరుడు లాంటోడు, అతనితో నాకు సంబంధం అంటగడుతున్నారు... అంటూ ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నకు సమాధానం చెప్పింది. ఆడవాళ్లు కొంచెం పేరొచ్చి కీలకంగా వ్యవహరిస్తే చాలు ఏవో ఆరోపణలు చేస్తారు. సినిమాలు, రాజకీయాల్లో అది సహజం. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మంచి, చెడు రెండూ ఉంటాయి. మెచ్చుకునేవారు, బురద చల్లేవారూ ఉంటారు. అన్నింటిని నేర్చుకుంటున్నాను. ప్రియాంకా గాంధీ, షర్మిల, యామిని... ఇది ఇక్కడితో ఆగిపోదు. లేనిపోనివి సృష్టించి ప్రచారం చేసైేవాళ్లకు ఇదేం ఆనందాన్నిస్తుందో నాకు అర్థం కావడం లేదు, ఇలాంటి వారి విమర్శలకు జవాబు ఇవ్వదలచుకోలేదు. అలా చేస్తే నా విజ్జత తగ్గించుకున్నట్టే.  

సోషల్ మీడియాలో పనీపాటా లేనివాళ్లు ఇలాంటి పనులు చేస్తుంటారు. ‘నాకు ముగ్గురు ఆడపిల్లలు. నా పిల్లల భవిష్యత్ ముఖ్యం. పిల్లల బాధ్యత, వ్యాపారం, రాజకీయం... వీటితోనే నాకు సరిపోతుంది. వీటిలో తలమునకలు అయిన అలాంటి పనికిమాలిన ఆరోపణలు చూసి ఆలోచించేంత టైం కూడా లేదన్నారు. అసలు ఆ ఆరోపణలు చేసేవారికి నా గురించి ఏం తెలియదు. వ్యక్తిత్వాన్ని హననం చేసి ఆనందం పొందడం వారి ఉద్దేశం. దాని గురించి మనం ఎందుకు టైం వేస్టు చేసుకుని బాధపడాలి అని అన్నారామె. ఇలాంటి దుర్మార్గుల ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉంటారు కదా అని అన్నారు. ఈ విషయాన్ని  వారి విజ్జతకే వదిలేస్తున్నా అన్నారు యామిని.