దారుణం.. కాలేజీలో 68 మంది అమ్మాయిల బట్టలు విప్పించారు

August 15, 2020

ఒక వార్త సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ అదే పనిగా వైరల్ గా అవుతోంది. సంచలనంగా మారిన ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గుజరాత్ లోని ఒక కాలేజీ యాజమాన్యం తమ కాలేజీలో చదివే 68 మంది అమ్మాయిల లోదుస్తుల్ని విప్పించి పరీక్షించటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇది అనాగరికమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎందుకు చోటు చేసుకుంది? కాలేజీ యాజమాన్యం తాము చేసిన పనిని ఎందుకు సమర్థించుకుటోంది? అసలు వాస్తవం ఏమిటన్న విషయంలోకి వెళితే..
గుజరాత్ లోని భుజ్ లో స్వామి నారాయణ్ ద్విశాతాబ్ది మెడికల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి అధ్వర్యంలో శ్రీ సహజనంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్ ను నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీలో 1500 మంది వరకూ విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారే. భారతీయ సంప్రదాయాల ఆధారంగా ఈ కాలేజీని ఏర్పాటు చేశారు.
ఆచారాలు.. నియమాలు.. సంప్రదాయ విలువలకు అమితమైన ప్రాధాన్యం ఇస్తారు. ఈ కాలేజీ రూల్ ప్రకారం విద్యార్థినులు రుతుక్రమంలో కిచెన్ తో పాటు క్యాంపస్ లోని ఆలయంలోకి ప్రవేశించకూడదు. అదే సమయంలో తోటి విద్యార్థినులను తాక కూడదు. ఈ నిబంధనల్ని పలువురు స్టూడెంట్స్ అమలుచేయటం లేదన్న ఫిర్యాదు కళాశాల యాజమాన్యం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తాము రాసుకున్న రూల్ బుక్ కు భిన్నంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై కాలేజీ ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరును పలువురు తప్పు పడుతుననారు.
కాలేజీకి వచ్చిన విద్యార్థినుల్లో రుతుక్రమంలో ఉన్నారా? లేరా? అన్న విషయాన్ని తేల్చేందుకు ఒకక్లాస్ రూంలో ఉన్న 68 మంది అమ్మాయిల్ని బయటకు తీసుకొచ్చి.. బాత్రూంలోకి వారిని పంపి.. ఒక వరుసలో నిలబెట్టారు. అనంతరం ఒక్కొక్కరి లో దుస్తుల్ని విప్పదీయించి.. వారు నెలసరితో ఉన్నారా? లేరా? అన్నది పరీక్షించారు.  ప్రిన్సిపల్ సమక్షంలో జరిగిన ఈ తతంగం బయటకు వచ్చింది. ఇది కాస్తా సంచలనమైంది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమ లో దుస్తులు తీసేందుకు నో చెబితే.. వారిని బెదిరించినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున రావటంతో ఇదో ఇష్యూగా మారింది. బయటకు వచ్చిన ఈ ఉదంతంపై మహిళా కమిషన్ కన్నెర్ర చేసింది. విచారణకు ఆదేశాలు జారీ చేసింది.