రివెంజా? పొరపాటా? ... బీజేపీని బుక్ చేసిన సాయిరెడ్డి

February 24, 2020

మోడీ మీద ఈగ వాలనివ్వని విజయ సాయిరెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఒకవైపు జగన్ మోడీ ఆలోచనలకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఏపీ బీజేపీ వాటిని ఎడాపెడా ఏకిపడేస్తోంది. ఎంతో కష్టపడి జగన్ కోసం మోడీతో సాన్నిహిత్యం సంపాదించిపెడితే... దానిని అడ్డంగా చెడగొట్టుకుని జగన్ పాడవడమే కాకుండా తనను నాశనం చేస్తున్నాడన్న బాధతో కొన్ని రోజులుగా మదనపడుతున్నారు సాయిరెడ్డి. ప్రస్తుతానికి జగన్ కి - సాయిరెడ్డికి చక్కటి సంబంధాలున్నా కూడా... జగన్ ఇలాగే ప్రవర్తిస్తే భరించే అవకాశం విజయసాయిరెడ్డికి లేదు. దీంతో ఆయన తన దారి తాను చూసుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదు.
అయితే, తాజాగా సాయిరెడ్డి పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ఒక పెద్ద బాంబు వేశాడు. దీంతో బీజేపీ - వైసీపీ లది దొంగాట అని స్పష్టంగా చెప్పినట్టుంది సాయిరెడ్డి వ్యాఖ్యానం. సాయిరెడ్డి ఏమన్నారంటే...
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సంప్రదించకుండా జగన్ ఏమీ చేయడం లేదు. వాళ్లిద్దరినీ సంప్రదించాకే జగన్ ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నారు. జగన్ కు ఆ ఇద్దరి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టును ఆపడం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)లను సమీక్ష చేయడం ... ఈ రెండు విషయాల్లోనూ మోడీ, అమిత్ షా అనుమతితోనే జగన్ ముందుకు వెళ్లారు. మోదీతో మాట్లాడాకే వీటిపై నిర్ణయం తీసుకున్నాం.
ఇవీ ఆయన మాట్లాడిన మాటలు. అంటే...ఎవరు ఎవరిని ఫూల్ చేయాలనుకుంటున్నారు. మోడీ, షాల అనుమతి తోనే పీపీఏలను సమీక్షించినపుడు ఇంధన శాఖ ఎందుకు రెండు సార్లు వద్దని చెప్పింది. కేంద్రం ఎందుకు దానిని డిస్కరేజ్ చేసినట్లు నటించింది? పోలవరం విషయం... జగన్ తప్పు చేస్తున్నాడని పార్లమెంటు సాక్షిగా బీజేపీ మంత్రి అబద్ధం చెప్పారా ? అంటే బీజేపీ జగన్ మీద వేస్తున్న ట్వీట్లన్నీ అబద్ధమా? బీజేపీ విమర్శలు అన్నీ ఫేకా? ఇద్దరూ కలిసి శత్రువుల్లా నటించి ఆంధ్రులను ఫూల్స్ ని చేశారా?

విజయసాయిరెడ్డి
జగన్ మోహన్ రెడ్డి
బీజేపీ ఏపీ నేతలు...
దీనికి ఏం సమాధానం చెబుతారు?